Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో విచిత్రం : వందల కోట్ల ఫైటర్ జెట్ మిస్సింగ్ .. తెలిస్తే చెప్పాలంటూ ప్రజలకు సైన్యం విజ్ఞప్తి

అమెరికాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వందల కోట్ల విలువైన యుద్ధ విమానం మిస్ అయ్యింది. దాని ఆచూకీ తెలిస్తే చెప్పాలని అధికారులు పౌర సమాజాన్ని కోరారు.  ఈ ఎఫ్ 35 జెట్‌ను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసింది. 

fighter jet missing in south carolina ksp
Author
First Published Sep 18, 2023, 5:01 PM IST

సాధారణంగా యుద్ధ విమానాలు నిలిపి వుంచే చోట, అది ప్రయాణించే మార్గాల్లో అత్యంత భారీ భద్రత వుంటుంది. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది తప్పించి.. సామాన్యులు ఆ ప్రాంతంలోకి రావడం అసాధ్యం. అలాంటి అమెరికాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వందల కోట్ల విలువైన యుద్ధ విమానం మిస్ అయ్యింది. దాని ఆచూకీ తెలిస్తే చెప్పాలని అధికారులు పౌర సమాజాన్ని కోరారు. వివరాల్లోకి వెళితే.. సౌత్ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి బయల్దేరిన ఫైటర్ జెట్ ఎఫ్ 35 జాడ లేకుండా పోయింది. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాని విలువ వందల కోట్లలో వుంటుందని అంచనా. 

విషయం తెలుసుకున్న అధికారులు చార్లెస్టన్‌లో ఫెడరల్ ఏవియేషన్ రెగ్యులేటర్ అధికారులతో కలిసి దానిని వెతుకుతున్నారు. ఆ నగరంలోని రెండు సరస్సులను కూడా గాలిస్తున్నారు. అయితే అధికారుల చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. ఇంతటి అత్యాధునిక ఫైటర్ జెట్‌లో ట్రాకింగ్ డివైస్ లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఎఫ్ 35 జెట్‌ను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసింది. ఒక్కో యుద్ధ విమానం ధర 80 మిలియన్ల డాలర్లపైనే వుంటుందని అంచనా. 

Follow Us:
Download App:
  • android
  • ios