ఫిమేల్ బ్రూస్ లీ : రెస్టారెంట్లో చేయిపట్టుకున్న కస్టమర్ ను రఫ్షాడించిన వెయిట్రెస్.. వీడియో వైరల్..
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే కోటి మందికి పైగా ఈ వీడియోను చూశారు.
ఆత్మరక్షణ ఆడవారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అన్నింటికంటే, దాడి ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియదు. అయినా, ప్రాథమికంగా ఆత్మరక్షణ గురించి తెలిసి ఉంటే.. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అనుకోకుండా ఎదురయ్యే ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి కూడా సహాయపడుతుంది. అలాంటి ఘటనే ఒక రెస్టారెంట్‌లోని వెయిట్రెస్ కు జరిగింది.
ఆమెకు హాని కలిగించడానికి ప్రయత్నించిన ఇద్దరు కస్టమర్‌లు ప్రయత్నించారు. అంతే తనకొచ్చిన మార్షల్ ఆర్ట్స్ తో ఆమె వారికి బుద్ది చెప్పింది. ఇది మొత్తం అక్కడి సీసీటీవీలో నమోదయ్యంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో మిలియన్ వ్యూస్ లను సాధించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారిన ఈ 15-సెకన్ల వీడియోలో రెస్టారెంట్ మొత్తం ఖాళీగా ఉంది.. ఒక టేబుల్ దగ్గర మాత్రం ఇద్దరు పురుషులు కూర్చున్నారు. ఆ టేబుల్ దగ్గర నిలబడి వెయిట్రెస్‌తో కనబడుతుంది. టేబుల్‌పై అనేక ఖాళీ సీసాలు పేరుకుపోయి కనిపిస్తాయి. ఇంతలో.. ఇద్దరిలో ఒకరు లేచి నిలబడి వెయిట్రెస్ చేయి బలవంతంగా పట్టుకోవడం కనిపిస్తుంది. మొదట, ఆమె వేగంగా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ రెండవసారి పట్టుకున్న తర్వాత, ఆమె అతని కడుపులో, మొహం మీద పంచులు కురిపించింది.
ఇంతలో, మేము రెండవ వ్యక్తి ఆమెతో పోరాడటానికి ప్రయత్నించడం గమనిస్తాం. కానీ అతనికీ అదే ట్రీట్మెంట్ జరుగుతుంది. దీంతో వీడియో ముగుస్తుంది. ట్విట్టర్ ఇప్పటికే ఆ మహిళకు "ఫిమేల్ బ్రూస్ లీ" అని టైటిల్ పెట్టింది. వెయిట్రెస్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో ఇంటర్నెట్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అయితే, ట్విట్టర్‌లోని ఒక విభాగం ఈ పోరాటాన్ని "డైరెక్ట్ మూవీ..’ అని ఒకరనగా.. "రంగస్థలం" అని మరొకరు పేర్కొన్నారు.
వారికి తగిన శాస్తి జరిగిందని.. అమ్మాయే కానీ ఆడపులి అని మరొకరు.."ఆమె కుర్చీని పట్టుకున్న విధానం ఆమె థానోస్‌తో పోరాడటానికి సిద్ధంగా ఉంది" అంటూ మరొకరు రాశారు. సినిమాల్లో ఇలాంటి సీన్లు వేరేలా కనిపిస్తాయి. ఎందుకంటే అవి ఒరిజినల్ కాదు కాబట్టి.. ఈ సీన్ ను సినిమాల్లో పెట్టొచ్చు.. అని భిన్నంగా స్పందిస్తున్నారు.