జూమ్ మీటింగ్ లో ఆమెకు బులెట్ గాయం తగిలి.. రక్తం కారుతూ ఉండటాన్ని మీటింగ్ లోని ఇతరులు గమనించడం గమనార్హం. వారు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించారు
అమెరికాలో తుపాకీ సంస్కృతి కొనసాగుతోందన్న విషయం మనకు తెలిసిందే. ఈ తుపాకీ సంస్కృతీ కారణంగా రెండేళ్ల కుమారుడి చేతిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్న ఓ మహిళను.. ఆమె రెండేళ్ల కుమారుడు తుపాకీతో కాల్చిచంపేశాడు. అయితే.. ఆ బాలుడికి తుపాకీ దగ్గర పెట్టినందుకు గాను అతని తండ్రిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫ్లోరిడాకు చెందిన వీండ్రే ఆవిరి(22) తుపాకీ ని లోడ్ చేసి కనీసం జాగ్రత్త లేకుండా ఇంట్లో పెట్టేశాడు. అది టీవీల్లోని పాపట్రోల్ కార్యక్రమం చూస్తున్న అతని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ తుపాకీ తీసుకువచ్చి తల్లి షమయ లిన్(21) ని కాల్చేశాడు. ఆ సమయంలో ఆమె జూమ్ ఆఫీస్ మీటింగ్ లో ఉండటం గమనార్హం.
Also Read: అమెరికాలో ఇళ్లమీదే కుప్పకూలిన విమానం: ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
కాగా... జూమ్ మీటింగ్ లో ఆమెకు బులెట్ గాయం తగిలి.. రక్తం కారుతూ ఉండటాన్ని మీటింగ్ లోని ఇతరులు గమనించడం గమనార్హం. వారు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లిని కాల్చి చంపిన తర్వాత బాలుడు ఏడుస్తూ కూర్చోవడం గమనార్హం.
వెంటనే.. మీటింగ్ లో గమనించిన తోటి ఉద్యోగులు అత్యవసర సేవలకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి.. ఆమె చనిపోయి ఉంది. అయితే.. దీనంతటికీ ఆమె భర్త వీండ్రే ఆవిరి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఆండ్రే ఆవిరి ని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.
జిల్లా న్యాయవాది డాన్ ఫాగార్డ్ ప్రకటన ప్రకారం విచారణ తేదీ ఇంకా నిర్ణయించకపోవడం గమనార్హం.
Also Read: మరో అమ్మాయితో బాయ్ ఫ్రెండ్ జల్సా.. టెక్నాలజీ సాయంతో పట్టుకుని దుమ్ము దులిపేసిన యువతి..
యునైటెడ్ స్టేట్స్‌లో పిల్లలు ప్రమాదవశాత్తు కాల్పులు చేయడం వింత కాదు. సెప్టెంబరు చివరలో, రెండు సంవత్సరాల బాలుడు టెక్సాస్‌లో బంధువుల బ్యాక్‌ప్యాక్‌లో లోడ్ చేసిన తుపాకీని కనుగొని ప్రమాదవశాత్తు ఆత్మహత్య చేసుకున్నాడు.
