ఇటలీ ప్రధానికి ఆ దేశ ప్రజలు ఓ వినూత్న క్రిస్మస్ బహుమతి ఇచ్చారు. ప్రభుత్వం మీద రూ. 900 కోట్లకు దావావేసి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఇటలీలో కొవిడ్ 19 మృతుల బంధువులు ఆ దేశ ప్రధానిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటలీ ప్రధానికి ఆ దేశ ప్రజలు ఓ వినూత్న క్రిస్మస్ బహుమతి ఇచ్చారు. ప్రభుత్వం మీద రూ. 900 కోట్లకు దావావేసి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఇటలీలో కొవిడ్ 19 మృతుల బంధువులు ఆ దేశ ప్రధానిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తం 500మంది బాధితులు ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రభుత్వంపై దావా వేశారు. తమకు జరిగిన నష్టానికి రూ. 900 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారు తమ దావాలో ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటే, ఆరోగ్య శాఖ మంత్రి రోబర్టో స్పెరాంజా, లాంబార్డీ ప్రాంత గవర్నర్ అట్టిలియో ఫొంటానా పేర్లను చేర్చారు.
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన మొదట్లో దాని కారణంగా అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ముందుంది. ఫిబ్రవరిలో ఆ దేశంలో వైరస్ ఉనికిని గుర్తించగా.. ఇప్పటివరకు 70 వేలకు పైగా మరణించారు.
ఐరోపా పరంగా చూసుకుంటే మృతుల విషయంలో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. ఆ దేశం వైరస్ తో ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయితో ఈ లెక్కలే చెప్తున్నాయి. లాంబార్డీలో వైరస్ తో తీవ్రంగా ఇబ్బంది పడిన బెర్గామో ప్రాంతానికి చెందిన 500మంది ఆప్తులను కోల్పోయారు.
ఏప్రిల్ లో వీరంత ఓ బృందంగా ఏర్పడి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. తమకు జరిగిన నష్టంపై న్యాయ పోరాటం మొదలుపెట్టారు. తమ బాధ్యతలు నిర్వర్తించని వారికి ఇది క్రిస్మస్ బహుమతి అంటూ ఈ బృందనికి నేతృత్వం వహిస్తోన్న లూకా పుస్కో ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైరస్ విజృంభిస్తోన్న సమయంలో లాక్ డౌన్ విధించడంలో అది తెచ్చిపెట్టిన ఆర్థిక నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సంసిద్ధత లేకపోవడం, ప్రణాళిక బద్ధంగా వ్యవహరించకపోవడాన్ని ఆయన తప్పు పట్టాడు. అయితే, ఈ దావాపై ప్రధాని, ఆరోగ్య మంత్రి గవర్నర్ అధికార ప్రతినిధులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటలీలో వైరస్ విజృంభణపై ఇప్పటికే ఆ దేశ ప్రధానిని కూడా ప్రాసిక్యూటర్లు ప్రశ్నించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 24, 2020, 12:44 PM IST