సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కార్యాలయంలో విషపు వాయువుల ఆనవాళ్లు కనిపించడం సంచలనం కలిగించింది. సిలికాన్ వ్యాలీలోని ఫేస్‌బుక్ కార్యాలయానికి ఓ పార్శిల్ వచ్చింది.

ఆ పార్సిల్‌ను తాకిన ఇద్దరు ఉద్యోగులు వాయువు దుష్పరిణామానికి గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు .. స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది... కంపెనీ ఉద్యోగులను మూడు భవనాల నుంచి ఖాళీ చేయించారు.

పార్శిళ్ల విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. సదరు వాయువును ‘‘సారిన్’’గా గుర్తించారు. ఈ వాయువు అత్యంత ప్రమాదకరమైనది.. ఇది నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. అలాగే 1995లో జపాన్‌లో ఆరు రైళ్లలో సారిన్ వదలడంతో 13 మంది చనిపోయినట్లుగా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు తెలిపారు.