కరోనా వైరస్ కారణంగా మనిషి జీవితంలో మాస్క్ నిత్యావసరం అయ్యింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మాస్క్ విషయంలో సంచలన ప్రకటన చేశారు. ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారు మాస్క్‌లు ధరించవద్దంటూ వారు హెచ్చరించారు.

వీటిని ధరించడం వల్ల వారికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం వుందని వారు హెచ్చరించారు. సాధారణ ప్రజలు బిగువుగా ఉండే మాస్క్‌లు ధరించడం వల్ల వారికి ఆక్సిజన్ సరిగ్గా అందక ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం వుందని, వారు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించకపోవడమే మంచిదని సూచించారు.

Also Read:వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడికి కొత్త డ్రగ్: చైనా శాస్త్రవేత్తలు

బయటకు వెళ్లినప్పుడు, అదీ పక్కవారితో రెండు మీటర్లు భౌతిక దూరాన్ని పాటించడం కుదరనప్పుడు మాత్రమే బిగుతుగా ఉండే మాస్క్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా మాస్క్‌ల వినియోగంపై తొలి నుంచి నిపుణులు విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

సర్జికల్ మాస్క్‌లు సర్జికల్ సిబ్బంది నుంచి రోగులకు రక్షణ కల్పించడం కోసం  వచ్చాయన్న వారు.. వారితో పాటు రోగులు మాత్రమే ధరిస్తే సరిపోతుందనే వార్తలు తొలుత వచ్చాయి.

సాధారణ మాస్క్‌ల వల్ల ప్రయోజనం లేదని, మూడు పొరలు కలిగిన ఎన్-95, అంతకన్నా నాణ్యమైన మాస్క్‌లు వేసుకోవడమే ప్రయోజనకరమని డాక్టర్లు సూచించారు. ఇక వదులుగా ఉండే మాస్క్‌ల వల్ల లాభం లేదని, బిగుతుగా ఉండే మాస్క్‌లతోనే ప్రయోజనమంటూ ఆ తర్వాత వివరణలు ఇచ్చారు.

Also Read:గట్టిగా మాట్లాడినా , అరిచినా కరోనా వ్యాప్తి.. గాలిలోనే 14 నిమిషాలు

రోగులు తప్ప ఇతరులు మాస్క్‌లు వాడటం వల్ల వారికి ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువంటూ హెచ్చరికలు చేశారు. ప్రతీసారి మాస్క్‌లను చేతులతో సర్దుకోవడం వల్ల లేనివారు కూడా అనవసరంగా వైరస్ బారినపడే ప్రమాదం ఉందన్నారు.

ఇటువంటి పరిస్ధితుల్లో ఎవరికి వైరస్ సోకిందో, ఎవరికి సోకలేదో తెలియదు కనుక ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలంటే ప్రభుత్వాలే తేల్చి చెప్పాయి. తాజాగా బిగుతైన మాస్క్‌ల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని, తప్పనిసరి పరిస్ధితుల్లో తప్పించి మిగిలిన వేళల్లో మాస్క్‌లు ధరించవద్దని చెబుతున్నాయి.