Asianet News TeluguAsianet News Telugu

గట్టిగా మాట్లాడినా , అరిచినా కరోనా వ్యాప్తి.. గాలిలోనే 14 నిమిషాలు

బిగ్గరగా మాట్లాడినా, అరిచినా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందట. ఇలా బయటకొచ్చిన కరోనా ప్రభావం ఏకంగా 14 నిమిషాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

A minute of loud talking can generate more than 1,000 coronavirus-laden droplets
Author
Hyderabad, First Published May 19, 2020, 12:57 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే 30లక్షల మందికి పైగా పాకేసింది. దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా... ఇప్పటి వరకు ఈ వైరస్ కి వ్యాక్సిన్ కానీ మందు కానీ కనుగొనలేకపోయారు.  దాని కోసం ప్రపంచంలోని అన్ని దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

కాగా.. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలో కరోనా వైరస్ గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బిగ్గరగా మాట్లాడినా, అరిచినా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందట. ఇలా బయటకొచ్చిన కరోనా ప్రభావం ఏకంగా 14 నిమిషాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

బిగ్గరగా మాట్లాడితే నోటి నుంచి వచ్చే సూక్ష్మ నీటి బిందువులు గాల్లోకి చేరి కరోనా వైరస్ వ్యాప్తి చెంది, దాదాపు 14 నిమిషాలు జీవించి ఉంటుందని.. యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ పరిశోధికులు గుర్తించారు. గట్టిగా మాట్లాడినప్పుడు చిన్న చిన్న బిందువులు నోటి నుంచి విడుదల అవుతాయి. అవి గాలిలో 14 నిమిషాల వరకూ జీవించే ఉంటాయి. 

ఆ నీటి బిందువులే కరోనా వ్యాప్తికి కారణం అవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఓ లేజర్ లైట్ ఉపయోగించి.. కరోనా సోకిన వ్యక్తి మాట్లాడేటప్పుడు నోటి నునంచి ఎన్ని తుంపర్లు బయటకు వచ్చాయో లెక్కకట్టగా.. సెకనుకు వెయ్యి కంటే ఎక్కువ నీటి తుంపర్లు విడుదల అవుతాయని తేలింది. అందుకే మాట్లాడేటప్పుడు కూడా నోటికి మాస్క్ పెట్టుకోవడం ఉత్తమమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios