Coronavirus: ఒమిక్రాన్‌తో మ‌రిన్ని వేరియంట్స్.. నిపుణుల హెచ్చ‌రిక‌లు !

Coronavirus: దాదాపు అన్ని దేశాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌స్తుతం దీనికి కార‌ణ‌మైన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధిక‌మ‌వుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప‌రిశోధ‌కులు ప‌లు హెచ్చ‌రిక‌లు చేశారు. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కార‌ణంగా మ‌రిన్ని వేరియంట్ పుట్టుకొస్తాయ‌ని చెబుతున్నారు. వీటి ప్ర‌భావం ఎలా ఉంటుంది అనేది ఖ‌చ్చితంగా చెప్ప‌లేక‌పోయిన‌.. దీని కంటే అధికంగా ఉంటే అవ‌కాశ‌లు లేక‌పోలేద‌ని  హెచ్చరిస్తున్నారు. 

Expect more worrisome variants after Omicron, scientists say

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. మ‌రీ ముఖ్యంగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. విజృంభిస్తున్న‌ది. దీంతో చాలా దేశాల్లో క‌రోనా వైర‌స్ (Coronavirus) బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్న‌ది.  ఈ క్ర‌మంలోనే ప‌రిశోధ‌కులు హెచ్చిరిస్తూ.. మాన‌వాలి ఎదుర్కొన‌బోయే వైర‌స్ ల‌లో ఇదే చివ‌రిది కాద‌ని పేర్కొంటున్నారు. మ‌రిన్ని కోవిడ్ వేరియంట్లు.. ముఖ్యంగా ఒమిక్రాన్ సంబంధిత ల‌క్ష‌ణాలు క‌లిగిన‌వి పుట్టుకొస్తాయ‌ని చెబుతున్నారు. ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఇప్ప‌టికీ ఖ‌చ్చిత‌మైన వివ‌రాలు తెలియ‌లేదు. కానీ.. ప్ర‌స్తుతం ఉన్న డేటా ప్ర‌కారం... స్వ‌ల్ప ప్ర‌భావం చూపుతూ.. అత్య‌ధిక వేగంగా వ్యాపిస్తుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. దీనికి తోడు మ‌రిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయ‌ని ప‌రిశోధ‌కుల అంచ‌నాల క్ర‌మంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ఎప్పటికి ముగుస్తుందన్న ప్రశ్న మొదలైంది. 
 
రాబోయే కాలంలో కొత్త వేరియంట్ (Coronavirus) లో మరిన్ని వైవిధ్యాలను ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌నీ, మ‌రీ ముఖ్యంగా ఒమిక్రాన్ కార‌ణంగా మ‌రిన్ని వేరియంట్లు పుట్టుకు వ‌స్తాయ‌ని ప‌రిశోధ‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే  బోస్టన్ యూనివర్శిటీకి చెందిన ఎపిడిమాలజిస్ట్ లియోనార్డో మార్టినెజ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో, అంత ఎక్కువగా రూపాంతరం చెందుతుందని అన్నారు. ఇలాంటి ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా మున్ముందు అనేక రకాల వేరియంట్స్ పుట్టుకు వచ్చే అవకాశం ఉంటుందని వెల్ల‌డించారు. తదుపరి వేరియంట్ రాకను నిర్ధారించడానికి లేదా అంచనా వేయడానికి మార్గం లేదని చెప్పారు. అయితే భవిష్యత్ లో రాబోయే క‌రోనా వైర‌స్ (Coronavirus) రూపాంత‌రాలు స్వ‌ల్ప అనారోగ్యానికి కారణమవుతాయని అంచ‌నా వేశారు. కానీ ఇదే ప‌క్క‌గా ఉంటుంద‌నే హామీ లేదని అన్నారు. ఇప్పుడున్న వాటికంటే ప్ర‌మాద‌క‌రంగానూ విజృంభించే వేరియంట్లు కూడా ఉండ‌వ‌చ్చున‌ని చెప్పారు. 

క‌రోనా కొత్త వేరియంట్ (Coronavirus) ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుదండంతో మ్యుటేషన్‌కు ఎక్కువ అవకాశాలు  లభిస్తాయి. దీని వల్ల మరిన్ని వేరియంట్‌లు వెలుగులోకి వచ్చే ప్రమాదం అధికంగా ఉంది అని  జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ స్టువర్ట్ కాంప్‌బెల్ రే అన్నారు. అయితే,  వైరస్ ఇలా రూపాంతరం చెందడానికి ప్రత్యెక కారణం అంటూ ఏమీ లేదు. కాలక్రమేణా వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరని తాను అనుకోవడం లేదంటూ వెల్ల‌డించారు. అలాగే, రాబోయే వేస‌వి కాలం ప్రారంభం లేదా మ‌ధ్య‌లో కొత్త ఒమిక్రాన్  సంబంధిత వేరియంట్ కేసులు వెలుగుచూసే అకాశముంద‌ని బ్రిటన్‌లోని సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ అంచ‌నా వేసింది. దీనికి ముఖ్య కార‌ణం  ప్రజలు మళ్ళీ సామజిక కార్యకలాపాలలో పాల్గొనడం వ‌ల్ల‌నే అని పేర్కొంది. దీని వ‌ల్ల కూడా క‌రోనా వైర‌ప్ కొత్త కేసులు (Coronavirus) గ‌ణ‌నీయంగా పెరుగుద‌ల‌ను న‌మోదుచేస్తాయ‌ని హెచ్చిరించారు. అయితే, ప్ర‌స్తుతం మ‌న‌ముందున్న స‌వాలు అంద‌రికీ టీకాలు అందించ‌డం, వైర‌స్ ల‌ను అడ్డుకోవ‌డానికి యూనివ‌ర్స‌ల్ (Coronavirus) వ్యాక్సిన్ కోసం కృషి చేయ‌డ‌మేన‌ని మ‌రికొంత మంది వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని దేశాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని  ఇప్పటికే ప్రపంచ  ఆరోగ్య సంస్థ పలు మార్లు సూచించిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios