Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి చుక్కెదురు..ఏడేళ్ల జైలు శిక్ష

జియా చారిట‌బుల్ ట్ర‌స్టు అవినీతి కేసులో ఆమెకు ఈ శిక్ష‌ను ఖ‌రారు చేశారు.

Ex-Bangladesh PM Khaleda Zia Gets 7 Years In Jail In Corruption Case
Author
Hyderabad, First Published Oct 29, 2018, 12:38 PM IST

బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని, బీఎన్‌పీ చైర్‌ప‌ర్స‌న్ ఖ‌లీదా జియాకు చుక్కెదురైంది. ఆమెకు  ఏడేళ్లే క‌ఠిన కారాగార‌ శిక్ష విధించారు. జియా చారిట‌బుల్ ట్ర‌స్టు అవినీతి కేసులో ఆమెకు ఈ శిక్ష‌ను ఖ‌రారు చేశారు. జియాతో పాటు హారిస్ చౌద‌రికి కూడా ఏడేళ్ల శిక్ష‌ను వేశారు. 

ఇద్ద‌రికీ ప‌ది ల‌క్ష‌ల జ‌రిమానా కూడా కోర్టు విధించింది. ప్ర‌ధానిగా ఉంటూ, ఓ స్వ‌చ్ఛంధ సంస్థ‌ను ఏర్పాటు చేసి, దాని కోసం నిధుల‌ను స‌మీక‌రించి, ఆ త‌ర్వాత ఆ డ‌బ్బును ధైర్యంగా దుర్వినియోగం చేసినందుకు ఖ‌లీదాకు క‌ఠిన శిక్ష విధించాల‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 

ఢాకాలోని స్పెష‌ల్ జ‌డ్జి కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఓ చిన్నారుల స్వచ్ఛంద సంస్థకు వచ్చిన అంతర్జాతీయ నిధులను 72 ఏళ్ల జియా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios