ట్రంప్ గల్ఫ్ పర్యటన సందర్భంగా ఎతిహాద్ ఎయిర్‌వేస్ 28 బోయింగ్ విమానాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ 14.5 బిలియన్ డాలర్లు. 2028 నుండి ఈ విమానాలు ఎతిహాద్ లో చేరనున్నాయి.

న్యూ ఢిల్లీ : ఎతిహాద్ ఎయిర్‌వేస్ 28 వైడ్-బాడీ బోయింగ్ విమానాలకు భారీ ఆర్డర్ ఇచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు గల్ఫ్ దేశాల పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది, ఇది అమెరికన్ కంపెనీలకు ప్రోత్సహకరంగా ఉంటుందని భావిస్తున్నారు. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్స్, తాజా బోయింగ్ 777X జెట్‌లు ఈ ఆర్డర్‌లో ఉన్నాయని గల్ఫ్ న్యూస్ తెలిపింది. ఈ విమానాలకు GE (జనరల్ ఎలక్ట్రిక్) తయారు చేసిన ఇంజిన్లు వాడుతున్నారు. 

2028 నుండి ఈ విమానాలు ఎతిహాద్ లో చేరే అవకాశం ఉంది.కొత్త విమానాలు ఎతిహాద్ కనెక్టివిటీ, సామర్థ్యాన్ని, ప్రయాణీకులకు అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని ఎతిహాద్ ఎయిర్‌వేస్ తెలిపింది.

"2023 నుండి, 2030 తాము బిజినెస్ ను డబుల్ చేద్దామనుకుంటున్నామని.. " అని UAE ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.