ట్రంప్‌పై చిరాకుతో రాజీనామా చేసిన యూఎస్ అంబాసిడర్!

Estonia US Ambassador To Resigns In Frustration Over Trump!
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి పట్ల చిరాకు చెందిన అమెరికా దౌత్యాధికారి ఒకరు తన పదవికి రాజీనామా చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి పట్ల చిరాకు చెందిన అమెరికా దౌత్యాధికారి ఒకరు తన పదవికి రాజీనామా చేశారు. ఎస్టోనియాకు యూస్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న జేమ్స్ డి మెల్విల్ తన పదవికి రాజీనామా చేశారు. జేమ్స్ రాజీనామాతో గత ఏడాది నుంచి ఇదే విషయమై రాజీనామా చేసిన వారి సంఖ్య మూటికి చేరింది. యూరోపియన్ దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగానే జేమ్స్ డి మెల్విల్ రాజీనామా చేసినట్లు సమాచారం.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎస్టోనియాకు యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న జేమ్స్ మెల్విల్ ఇవాళ ఉదయం (జూన్ 29) విదేశీ సేవల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈయన దాదాపు 33 ఏళ్లుగా ప్రజాసేవ చేశారు.

నాటో సభ్యులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, యూరోపియన్ దేశాల విషయంలో సుంకాల విధింపుపై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్‌ను  మరియు ఇరాన్ న్యూక్లియర్ డీల్‌ను తిరస్కరించడం మొదలైన అంశాలు జేమ్స్ రాజీనామాకు దారితీశాయి.

loader