రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటుకు నేతృత్వం వహించిన వాగ్నెర్ మెర్సెనరీ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంపై ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటుకు నేతృత్వం వహించిన వాగ్నర్ మెర్సెనరీ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఆ ప్రకటనలో విమాన ప్రమాదానికి కారణాలు వెల్లడించలేదు. కానీ, ప్రకటన ప్రిగోజిన్ చంపబడ్డాడనే అనుమానాలను పెంచింది. 

పుతిన్ జూన్ తిరుగుబాటును "దేశద్రోహం" అని ఖండించారు. పుతిన్ దేశం విడిచి బెలారస్కు వెళ్లడానికి క్రెమ్లిన్తో ఒప్పందం కుదుర్చుకోవడంతో తక్షణ ప్రతీకారం నుండి తప్పించుకున్నాడు.

పుతిన్ పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ దుర్మరణం.. అసలేం జరిగిందంటే ?

ఈ నేపథ్యంలోనే ప్రిగోజిన్ మరణంపై స్పందిస్తూ, టెస్లా సీఈఓ, ఎక్స్ యజమాని ఎలోన్ మస్క్ తాను ఊహించిన దానికంటే "ఎక్కువ సమయం" పట్టిందని వ్యాఖ్యానించారు. 

‘X’ యూజర్ ఒకరు ప్రిగోజిన్ మరణంపై "దీనికి ఎక్కువ సమయం పట్టలేదు" అని చేసిన పోస్ట్ కు మస్క్ అలా ప్రతిస్పందించారు. జూన్‌లో మాస్కో సైనిక నాయకత్వాన్ని కూల్చివేయడానికి వాగ్నర్ చీఫ్ తన బలగాలతో రష్యాలోకి ప్రవేశించాడు.

62 ఏళ్ల వాగ్నర్ చీఫ్ మాస్కో-సెయింట్ పీటర్స్‌బర్గ్ మధ్య ప్రయాణిస్తుండగా కుప్పకూలిన ప్రైవేట్ విమానంలో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానంలోని ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 10 మంది వ్యక్తులు మరణించారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎంఎన్టీ-ఎయిరోకి చెందిన విమానం క్రాష్‌పై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు రష్యా ఏవియేషన్ ఏజెన్సీ రోసావియాట్సియా తెలిపింది. తీవ్రమైన నేరాలను విచారిస్తున్న రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ, క్రాష్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.

ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలు లభ్యమయ్యాయని అత్యవసర సేవలను ఉటంకిస్తూ ఆర్ఐఏ నోవోస్టి తెలిపారు.