Elon Musk on Twitter : ప్ర‌పంచంలోనే అతిపెద్ద బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) ట్విట్టర్‌(TWitter)ను 41.39 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేశాడు. ఈ విషయాన్ని ఏప్రిల్ 14న ఒక రెగ్యులేటరీ వెల్లడించింది. అతను ట్విట్టర్‌ను 54.20డాలర్లకు ఒక్క షేర్‌కు నగదు రూపంలో కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది.   

Elon Musk on Twitter : ప్ర‌పంచంలోనే అతిపెద్ద కుబేరుడు ఎల‌న్‌మ‌స్క్(Elon Musk) .. ట్విట్ట‌ర్ మీద మ‌న‌స్సు పారేసుకున్నారు. ఎలాగైనా ట్విట్ట‌ర్ పిట్ట‌ను ద‌క్కించుకోవాలని య‌త్నిస్తున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ ను కైవసం చేసుకోవాలని ఎల‌న్‌మ‌స్క్ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ట్విట్ట‌ర్ ఒక్కో షేరును ను 54.20 డాల‌ర్లు చెల్లించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ర‌ట‌. గ‌త జ‌న‌వ‌రి 28న ట్రేడింగ్ ముగింపు ధ‌ర ప్ర‌కారం 54% ప్రీమియంను వాటా కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌తిపాదించారు. ఈ మొత్తం విలువ 43 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంది. Twitter Inc.ని కొనుగోలు చేయడానికి ఎల‌న్‌మ‌స్క్ `బెస్ట్ అండ్ ఫైన‌ల్‌` ఆఫ‌ర్ ప్ర‌తిపాదించిన వార్త వెలుగు చూడ‌టంతో ట్విట్ట‌ర్‌ షేర్ 18 శాతం దూసుకెళ్లింది. ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లోనూ 12 శాతం లాభంతో ట్రేడ‌యింది.

ట్విట్ట‌ర్ ప‌నితీరుపై ఆ సంస్థ చైర్మ‌న్ బ్రెట్ టేయ్ల‌ర్‌కు ఎల‌న్‌మ‌స్క్ లేఖ రాశారు."నేను పెట్టుబడి పెట్టినప్పటి నుండి, కంపెనీ అభివృద్ధి చెందదని లేదా ప్రస్తుత రూపంలో ఈ సామాజిక ఆవశ్యకతను అందించదని గ్రహించాను. ట్విట్టర్‌ను ప్రైవేట్ కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉంది" అని మస్క్ తెలిపారు. ఒక‌వేళ త‌న ఉత్త‌మ‌-తుది ఆఫ‌ర్‌ను అంగీకరించబడకపోతే..ట్విట్ట‌ర్‌లో వాటాదారుగా త‌న స్థానం గురించి పునః ప‌రిశీలించుకోవాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఎలాన్ మస్క్ గురువారం యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌లో ఫైలింగ్‌లో ఈ ఆఫర్‌ను ప్రకటించారు.

ఈ నెల నాలుగో తేదీన ట్విట్ట‌ర్‌లో 9 శాతం వాటాల‌ను ఎల‌న్‌మ‌స్క్ కొనుగోలు చేసిన‌ట్లు వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాటాను ప్రకటించిన తర్వాత కంపెనీ అతనికి బోర్డులో సీటు ఇచ్చింది, ఇది అతన్ని అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా చేసింది. తన పదవీకాలం ప్రారంభం కానున్న తరుణంలో, ట్విట్టర్ బోర్డులో చేరే ప్రణాళికను విరమించుకున్నట్లు మస్క్ తెలిపారు. బోర్డు సీటు తీసుకోవడం వల్ల కంపెనీని టేకోవ‌ర్ చేసుకోవ‌డానికి ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని మ‌స్క్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఎగ్జిక్యూటివ్ ట్విట్టర్‌లో అత్యధికంగా వీక్షించబడే ఫైర్‌బ్రాండ్‌లలో ఒకరు. ఆయ‌న‌కు 80 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోయ‌ర్లు ఉన్నారు. అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో విధించాలనుకుంటున్న మార్పుల గురించి బహిరంగంగా మాట్లాడాడు. గతంలో​ ట్విట్టర్​ సామర్థ్యంపై, వాక్​ స్వాతంత్య్రంపై మస్క్​ అనేక పోల్స్ నిర్వహించారు. దీంతో పాటు గతంలో కొత్త సోషల్ మీడియా ఫ్లాట్​ఫామ్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సంచలన ట్వీట్ చేశారు. తాజాగా ట్విట్టర్‌ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదన చేశాడు. “ట్విట్టర్ అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేను దాన్ని అన్‌లాక్ చేస్తాను. ఇది అభివృద్ధి చెందుతున్న కథ.” అని ఎలాన్ మస్క్ అన్నారు.