Tesla stocks soar: టెస్లా స్టాక్ దూకుడు కొనసాగుతోంది. దీని షేర్ ధరలు పెరగడంతో ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అవతరించాడు. ఈ ఏడాది టెస్లా కంపెనీ షేరు ధర దాదాపు 70 శాతం పెరగడంతో ఎలాన్ మస్క్ సంపద పెరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Elon Musk Is World's Richest Person: టెస్లా స్టాక్స్ ధరలు పెరగడంతో ఎలాన్ మస్క్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఈ ఏడాది టెస్లా కంపెనీ షేరు ధర దాదాపు 70 శాతం పెరగడంతో ఆయన సంపద భారీగా పెరిగిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. ట్విట్టర్ కొత్త బాస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్ స్థానంలోకి వచ్చారు. గత ఏడాది అధిక నష్టాల కారణంగా ఆయన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు. అయితే, ప్రస్తుతం టెస్లా షేర్ల ధరలు పెరగడంతో మళ్లీ తొలిస్థానానికి చేరుకున్నారు. టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారని బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. 2022 డిసెంబర్ లో టెస్లా షేర్లు క్షీణించడంతో ఆయన రెండో స్థానంలోకి పడిపోయారు. ఆయన స్థానాన్ని లూయిస్ విట్టన్ సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్ ఆక్రమించారు. అయితే రెండు నెలల తర్వాత మళ్లీ మస్క్ ప్రపంచ కుబేరుడు అనే సింహాసనంపై తిరిగి కూర్చున్నారు.
ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్..
ఎలాన్ మస్క్ సంపద ప్రస్తుతం 187 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ట్విటర్ యజమాని నికర విలువ 137 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021 సెప్టెంబర్ నుంచి ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలోకి ప్రవేశించారు. ఆయన కంటే ముందు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, చరిత్రలో అత్యధిక డబ్బు కోల్పోయి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టినందుకు మస్క్ ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని ధృవీకరించిన సంస్థ ఒక పత్రికా ప్రకటనలో "చరిత్రలో భారీగా వ్యక్తిగత సంపదను కోల్పోయిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డును అధికారికంగా బద్దలు కొట్టారు" అని పేర్కొంది.
గతంలో జపాన్ టెక్ ఇన్వెస్టర్ మసయోషి సన్ 56 బిలియన్ డాలర్లు నష్టపోయారని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం దాదాపు అసాధ్యం అయినప్పటికీ, మస్క్ మొత్తం నష్టాలు 2000 లో జపాన్ టెక్ ఇన్వెస్టర్ మసయోషి సన్ నెలకొల్పిన మునుపటి రికార్డు 58.6 బిలియన్ డాలర్లను మించిపోయాయని సమాచారం. ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్స్ తో సంబంధం కలిగి ఉన్నాయని బహిరంగ రహస్యం. కంపెనీ ప్రారంభ పెట్టుబడిదారులలో ఒకరుగా, చివరికి ఆటోమొబైల్ కంపెనీలో అతిపెద్ద వాటాలను కలిగిన వ్యక్తిగా ఎలాన్ మస్క్ ఉన్నారు. ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ ను జూలై 2003 లో టెస్లా మోటార్స్ గా మార్టిన్ ఎబెర్ హార్డ్, మార్క్ టార్పెన్నింగ్ స్థాపించారు. 2004 లో, మస్క్ 6.5 మిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా మారారు. ఆ తర్వాత 2008లో కంపెనీ సీఈఓ, ప్రొడక్ట్ ఆర్కిటెక్ట్ గా బాధ్యతలు చేపట్టారు. మస్క్ 2022 లో తన టెస్లా షేర్లలో ఎక్కువ భాగాన్ని విక్రయించారు. మొదట ట్విట్టర్ కొనుగోలు చేయడానికి, ఆ తరువాత ఈ కొనుగోలు నష్టాలను భరించడానికి టెస్లా షేర్లను విక్రయించారు.
