Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ కు మహిళా సారథిని కనుగొన్నాని ప్రకటించిన ఎలన్ మస్క్.. 6 వారాల్లో నియామకం జరుగుతుందని ట్వీట్..

ట్విట్టర్ కొత్త సారథి దొరికారని ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. సీఈవోగా ఒక మహిళను నియమించనున్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. ఆరు వారాల్లోగా ఆమె నియామకం పూర్తవుతుందని చెప్పారు. 

Elon Musk has announced that he has found a female head of Twitter. He tweeted that the appointment will be made in 6 weeks..ISR
Author
First Published May 12, 2023, 9:06 AM IST

ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్క్ ట్విట్టర్ కు కొత్త నాయకురాలిని కనుగొన్నానని ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లోగా నియామకం జరుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. తాను ఎగ్జికూటివ్ చైర్మన్, సీటీవో కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే ఆమె ఎవరనేది ఇంకా అధికారంగా స్పష్టం కానప్పటికీ.. ఎన్ బీసీ యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో నే ట్విట్టర్ కు కొత్త సారథిగా ఉంటారని తెలుస్తోంది. దీని కోసం చర్చలు జరుగుతున్నాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది.

ఘోరం.. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలన్నందుకు వృద్ధుడిని చితకబాది, మూత్రం పోసిన పక్కింటి వ్యక్తి..

ఆమె ప్రస్తుతం ఎన్ బీసీ యూనివర్సల్ మీడియాలో గ్లోబల్ అడ్వర్టైజింగ్ అండ్ పార్టనర్ షిప్స్ చైర్మన్ గా ఉన్నారు. అయితే తాజా జరుగుతున్న చర్చలపై స్పందించాలని కోరుతూ వచ్చిన ఇమెయిల్ కు ఆమె స్పందించలేదని ‘ఎన్డీటీవీ’ నివేదించింది. అయితే తాను ఎన్ బీసీ యూనివర్సల్ ప్రతినిధి ప్రకటనదారులకు కంపెనీ ముందస్తు ప్రజంటేషన్ ల కోసం రిహార్సల్స్ లో పనిలో బిజీగా ఉన్నానని తెలిపారు. 

కాగా.. ఎలన్ మస్క్ గత అక్టోబర్ లో ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ సంస్థలో మార్పులు చేస్తూ వస్తున్నాడు. ఆ సమయంలో సీఈవో గా ఉన్న పరాగ్ అగర్వాల్ ను పదవి నుంచి తొలగించారు. చాలా మంది ఉద్యోగులను కూడా ఇంటికి సాగనంపారు. అయితే అప్పటి నుంచి ఎలన్ మస్కే సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సంస్థ అభివృద్ధి చెందడానికి, తాను భావించిన సంస్థాగత పునర్నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కొంత కాలం మాత్రమే తాను బాధ్యతల్లో ఉంటానని గతంలోనే ప్రకటించారు. 

దారుణం.. ఇంటి నుంచి ఎత్తుకెళ్లి 13 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం..

కాగా.. గత డిసెంబర్ లో ఎలన్ మస్క్ ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టారు. అందులో ట్విట్టర్ సీఈవో పదవి నుంచి వైదొలగమంటారా ? వద్దా అని తన ఫాలోవర్లను కోరాడు. దీనికి 57.5 శాతం మంది అవునని ఓటేశారు. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మస్క్ సీఈవో పదవి నుంచి వైదొలగినప్పటికీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios