Elon Musk's Father: ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మ‌స్క్ త‌న రెండో భార్య కుతూరుతో బిడ్డ‌కు జ‌న్మించారు. ఈ సంచలన విషయం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయంగా మారింది. 

Elon Musk's Father: ఎలాన్ మస్క్ .. ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేని వ్య‌క్తి. ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత‌. ఆయ‌న ఏది చేసిన సంచ‌ల‌న‌మే.. ఇటీవ‌ల‌ ఎలాన్ మస్క్ తన తొమ్మిది మంది సంతానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. జ‌నాభా పెరుగుద‌ల కోసం తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఎలన్‌ మస్క్ తండ్రి ఎర్రోల్‌ మస్క్ కూడా ఏ మాత్రం తీసిపోలేడ‌ని తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూ  ద్వారా ఎర్రోల్‌ మస్క్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇప్పుడి ఈ వ్యాఖ‍్యలు ప్ర‌పంచ దేశాల‌ను విస్మయానికి గురి చేస్తున్నాయి. 
 
ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్‌ మస్క్‌(76 ఏళ్లు) తన స‌వతి త‌ల్లి కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌(35 ఏళ్లు)తో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడ‌ట‌. ఆమెతో ఆయ‌న‌ స‌హజీవ‌నం చేస్తున్నాడ‌ని, గ‌త మూడేళ్ల కిత్రం ఎలాన్ మాస్క్ తండ్రి మ‌రోసారి తండ్రి అయ్యాడ‌ట.  ఈ విషయాల‌న్నింటిని ఎర్రోల్ మాస్క్ స్వయంగా వెల్లడించాడు. 

వివరాల్లోకెళ్తే.. యూకేకి చెందిన ఓ మీడియా సంస్థ ఎర్రోల్‌ మస్క్‌ను తాజాగా  ఇంటర్వ్యూ  చేసింది. ఆ ఇంట‌ర్య్వూలో వాషింగ్టన్ యూనివర్శిటీ .. ప్రపంచంలో సంతానోత్పత్తి రేటుపై  ఓ డేటాను విడుదల చేసింది. ఆ డేటాపై ఎర్రోల్‌ మస్క్‌ మాట్లాడుతూ.. తగ్గిపోతున్న జనాభాకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పుకోచ్చాడు. ఈ భూమిపై మనం ఉన్నది  పునరుత్పత్తి కోసమేన‌నీ, అందుకే.. తాను జానా బెజుడెన్‌హౌట్‌ తో తొలిసారి 2017లో అబ్బాయికి, 2019లో పాపకు జన్మనిచ్చామ‌ని చెప్పాడు.

ఎర్రాల్ మస్క్ మొదటి భార్య పేరు మాయె హెల్డెమాన్. ఆమె కుమారుడే.. ఎలాన్ మస్క్. వారికి ఎలాన్ మస్క్ లో పాటు టోస్కా, కింబల్ అనే సంతానం క‌ల‌దు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఎర్రోల్ మస్క్ త‌న  మొదటి భార్యకు 1979లో విడాకులు ఇచ్చారు. అనంతరం హీడో బెజూడెన్హాట్‌‌ను అనే యువ‌తిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా.. రెండో వివాహమే. ఆమెకు కూతురే.. జానా బెజుడెన్‌హౌట్. కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్‌, జానా దంప‌తులకు అబ్బాయి, అమ్మాయి. జానాకు, ఎర్రోల్ మ‌స్క్ కు దాదాపు 40 ఏళ్ల వ్య‌త్యాసం. 

వివాదంలో ఎలన్ మస్క్
 
ప్ర‌స్తుతం టెస్లా అధినేత ఎలాన్ మస్క్  న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాడు. 44 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్విట్టర్ కొనుగోలును అర్ధాంతరంగా రద్దు చేసుకున్నాడు. ఒప్పందాన్ని రద్దు చేసుకోవ‌డంతో ట్విట్టర్ యాజమాన్యం కోర్టుకెక్కింది.