Asianet News TeluguAsianet News Telugu

నేపాల్ ఎన్నికలు.. ఏడోసారి ఎన్నికైన ప్రధాని షేర్ బహదూర్ దేవుబా

నేపాల్ కు ఐదో సారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న షేర్ బహదూర్ దేవుబా వరుసగా ఏడో సారి ఎన్నికల్లో విజయం సాధించారు. న పశ్చిమ నేపాల్‌లోని దదేల్‌ధురా నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థిపై భారీ ఓట్ల తేడాతో గెలుపొందారు. 

Elections of Nepal.. Prime Minister Sher Bahadur Devuba was elected for the seventh time
Author
First Published Nov 23, 2022, 10:31 AM IST

నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా వరుసగా ఏడో సారి ఎన్నికయ్యారు. ఆయన పశ్చిమ నేపాల్‌లోని దదేల్‌ధురా నియోజకవర్గం నుంచి భారీ ఓట్లతో విజయం సాధించారు. 77 ఏళ్ల దేవుబా తన సమీప ప్రత్యర్థి సాగర్ ధాకాల్ (31)పై 25,534 ఓట్ల మెజారిటీ సాధించాడు. ధాకల్ కేవలం 1,302 ఓట్లు మాత్రమే వచ్చాయి.

తన కళ్ల ఎదురుగా శృంగారంలో పాల్గొనమని చెప్పి... దారుణ హత్య..!

దేవుబా తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఏ పార్లమెంటరీ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. ధాకాల్ ఒక యువ ఇంజనీర్. ఆయన ఐదు సంవత్సరాల క్రితం బీబీసీ సజా సావల్ కార్యక్రమంలో ఓ బహిరంగ చర్చలో దేవూబాతో వాగ్వాదానికి దిగారు. తరువాత యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చాడు. దేవూబా వంటి సీనియర్లకు విశ్రాంతినివ్వాలని సూచిస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు.

చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 38 మంది మృతి.. పలువురికి గాయాలు

నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవుబా ప్రస్తుతం ఐదో సారి ప్రధానమంత్రిగా కొనసాగుతన్నారు. అధికార నేపాలీ కాంగ్రెస్ ఇప్పటి వరకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (హెచ్ఓఆర్)లో 10 స్థానాలను గెలుచుకోగా.. ఇతర 46 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. కేపీ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్ ఇప్పటి వరకు మూడు స్థానాలను గెలుచుకొని 42 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది.

హెచ్ వోఆర్, ఏడు ప్రాంతీయ అసెంబ్లీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. మొత్తం 275 మంది పార్లమెంటు సభ్యుల్లో 165 మందిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా, మిగిలిన 110 మందిని దామాషా ప్రకారం ఎన్నుకుంటారు. అలాగే మొత్తం 550 మంది రాష్ట్ర శాసనసభలలో 330 మంది సభ్యులను ప్రత్యక్షంగా, 220 మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios