Asianet News TeluguAsianet News Telugu

రోజూ ఒకే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడని.. ఆయనకు కేఫ్ సర్ ప్రైజ్..!

వారు ఇచ్చిన సర్ ప్రైజ్ కి ఆయన ముఖంలో ఆనందం ప్రైస్ లెస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Elderly man used to order the same Breakfast platter for Years ram
Author
First Published May 3, 2023, 11:14 AM IST

మనలో చాలా మంది ఇంట్లో తయారు చేసిన ఆహారాలనే తీసుకుంటాం. కానీ కొందరికి ఆ వెసులుబాటు లేక హోటల్స్ లో తింటూ ఉంటారు. అలా హోటల్స్ లో తినేవారు కొందరు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ రుచి చూసేవారు కూడా ఉంటారు. కానీ కొందరు మాత్రం ఒకే చోట ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ప్రతిరోజూ ఒకే హోటల్ లో ఒకే రకమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఓ వృద్ధుడు కూడా అలానే ప్రతిరోజూ ఒకే కేఫ్ కి వెళ్లి.. ఒకే రకమైన ఫుడ్ ఆర్డర్ చేసేవాడట. ఆయన ఆ కేఫ్ కి డైలీ కస్టమర్. దీంతో, ఆయన తమ కేఫ్ చూపిస్తున్న ప్రేమకు కేఫ్ ఇబ్బంది ఇంప్రెస్ అయ్యి ఆయనకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన తినే వంటకానికి ఆయన పేరే పెట్టారు. వారు ఇచ్చిన సర్ ప్రైజ్ కి ఆయన ముఖంలో ఆనందం ప్రైస్ లెస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

ఈ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో  గ్రాంజ్ కాన్ కిచెన్ అనే కేఫ్ షేర్ చేసింది. జాన్ అనే వృద్ధుడు ప్రతిరోజూ ఆ కేఫ్ లో అల్పాహారం తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ కేఫ్ కి ఆయన డైలీ కస్టమర్ కావడం విశేషం. 

జాన్ కేఫ్‌కి వెళ్లి తన సాధారణ అల్పాహారాన్ని ఆర్డర్ చేయడంతో వీడియో ప్రారంభమవుతుంది. ప్లేటర్‌లలో రెండు సన్నీ సైడ్ అప్‌లు, కాల్చిన కూరగాయలు , మాంసం ఉన్నాయి. కేఫ్ సిబ్బంది ఆ  డిష్‌కు జాన్స్ బ్రేక్‌ఫాస్ట్ అని పేరు పెట్టారు. అది మెనులో కూడా చేర్చడం విశేషం.  కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు రసీదు కూడా ఆ పేరు మీదే ఇవ్వడం విశేషం. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆ కేఫ్ లో అదే బ్రేక్ ఫాస్ట్ తింటూ వస్తున్నారట. అందుకే.. స్పెషల్ గా ఆయన కోసం ఆ పేరు మీద మెనూ కార్డులో దానిని యాడ్ చేశామని కేఫ్ సిబ్బంది చెప్పడం విశేషం.
 

Follow Us:
Download App:
  • android
  • ios