పంజరం శుభ్రం చేస్తుండగా చిలుకలు ఎగిరిపోయానని ఓ చిన్నారిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన పాకిస్థాన్ లోని ఇస్లామా బాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఇస్లామా బాద్ లో ఓ చిన్నారి చిలకలు అమ్మే దుకాణంలో పనిచేస్తోంది. ఆ చిన్నారి వయసు ఎనిమిది సంవత్సరాలు. కాగా..  ఆ దుకాణంలో పంజరాలు శుభ్రం చేస్తుండగా అందులోని చిలకలు ఎగిరిపోయాయి.  దీంతో.. ఖరీదైన చిలకలు ఎగిరిపోవడంతో ఆ ఇంటి యజమాని పాప మీద ఆగ్రహించాడు. కనీసం పసి పిల్ల అని కూడా కనికరించలేదు.

వెంటనే ఆ చిన్నారిని అతి కిరాతకంగా విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రగాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పిచంగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. కాగా.. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.