ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వున్న ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టవర్ నుంచి పర్యాటకులను క్లియర్ చేసినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వున్న ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది ఈఫిల్ టవర్ వద్ద పర్యాటకులను ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. టవర్‌తో పాటు దాని చుట్టు పక్కల వున్న దుకాణాలను మూయించి, ఆ ప్రాంతం నుంచి అందరినీ వెనక్కి పంపిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు టవర్ నుంచి పర్యాటకులను క్లియర్ చేసినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
