జపాన్‌లో సోమవారం భూకంపం సంభవించింది. జపాన్ దీవుల్లో అతిపెద్దదైన హోన్షు దక్షిణ తీరానికి సమీపంలో సోమవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది.

జపాన్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ దీవుల్లో అతిపెద్దదైన హోన్షు దక్షిణ తీరానికి సమీపంలో సోమవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. టోక్యో, ఇతర నగరాల్లో ప్రకంపలను చోటుచేసుకున్నట్టుగా అధికారులు చెప్పారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయబడలేదు. స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సెంట్రల్ మి ప్రిఫెక్చర్‌లో దాదాపు 350 కి.మీ లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.ఇక, ఫుకుషిమా అణు కర్మాగారాల వద్ద ఎటువంటి నష్టం లేదా అసాధారణతలు కనుగొనబడలేదని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌ఎకే తెలిపారు. 

యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా భూకంప తీవ్రత 6.1గా నమోదైందని తెలిపింది. భూకంప కేంద్రం నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. టోక్యోకు ఉత్తరాన ఉన్న ఫుకుషిమా, ఇబారకి ప్రిఫెక్చర్‌లు బలమైన వణుకును ఎదుర్కొన్నాయి. ఇక, భూకంపం నేపథ్యంలో షింకన్‌సేన్ బుల్లెట్ ట్రైన్‌లు, టోక్యో మెట్రో సేవలు ఆగిపోయాయి. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి.