Earthquake: నేపాల్‌ను భయపెడుతున్న భూకంపం.. మరోసారి భూప్రకంపనలు.. భయంతో పరుగులు
Earthquake: నేపాల్ లో మరోసారి భూకంపం కుదిపేసింది. రాజధాని ఖాట్మండులో మంగళవారం తెల్లవారుజామున 4:17 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.
Earthquake: నేపాల్ లో మరోసారి భూకంపం కుదిపేసింది. మంగళవారం తెల్లవారుజామున ఖాట్మండులో మరోసారి భూప్రకంనాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీనిని తీవ్రత 4.1 గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం అందించింది. భూ ప్రకంపనలతో వణికిపోయిన జనం భయంతో రోడ్లపైకి వచ్చి పరుగులు తీశారు. భూకంప కేంద్రం ధడింగ్‌లో ఉన్నట్టు, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్టు నేపాల్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణ విషయంగా మారిపోయాయి. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది....
అంతకు ముందు ఆదివారం నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంప కేంద్రం ఉంది. ఉదయం 7.39 గంటల సమయంలో భూకంపం సంభవించింది. బాగ్‌మతి, గండకి ప్రావిన్సుల్లోనూ ప్రకంపనలు సంభవించాయి.2007లో ఇక్కడ సంభవించిన భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది.