భూకంపం : టర్కీ, సిరియాల్లో 7,200 దాటిన మరణాలు, 20వేలమంది క్షతగాత్రులు..చిన్నారులను రక్షించిన రెస్క్యూ టీం..
తుర్కీయేలో సంభవించిన భూకంపంలో టర్కీ, సిరియాల్లో కలిసి 7,200 మందికి పైగా మరణించినట్లు అంచనా. దేశ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటి.

తుర్కియే : భారీ భూకంపం సంభవించి రెండు రోజులు గడుస్తున్నా తుర్కియే, సిరియాల్లో ఇంకా అది మిగిల్చిన విలయం తగ్గలేదు. మృతుల సంఖ్య నానాటికి వేల సంఖ్యలో పెరుగుతూ పోతుంది. ఎటు చూసినా భవనశిథిలాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. గడ్డ కట్టుకుపోయే చలి రెస్క్యూటీంలను పనిచేయకుండా చేస్తున్నాయి. ఒక్క రోజులోనే మరణించిన వారి సంఖ్య 7,200 దాటిపోయింది. అయితే ఈ విలయంలో 20వేల మందికిపైగా మరణించి ఉండొచ్చని డబ్ల్యుహెచ్వో అంచనా వేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ టర్కీ, సిరియాలకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.
శిధిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమో తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్క టర్కీలోని 6000 భవనాలు కూలిపోయాయి. 25వేల మంది సహాయక చర్యలకు దిగారు. కానీ వారి బలం ఏ మాత్రం సరిపోవడం లేదు. టర్కీ భూకంపం తర్వాత వందల సార్లు ప్రకంపనలు వచ్చాయి. చిన్నా, పెద్ద ప్రకంపనలు మొత్తం కలిపి దాదాపు ఇప్పటికీ 25 సంభవించినట్లుగా అంచనా. ఈ ప్రకంపనలు సహాయక చర్యలకు అడ్డుగా మారుతున్నాయి. అంతేకాదు మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని.. రెస్క్యూటిమ్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
టర్కీ, సిరియా భూకంపాన్ని ముందే ఊహించారా? మూడు రోజుల ముందే చేసిన ట్వీట్ నిజమయిందా?
ఈ ప్రకంపనల వల్ల బలహీనంగా మారిపోయినా.. ఇంకా పడిపోని భవనాలు కూలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఒక టర్కీ లోనే 5400 మంది మరణించారని 20,000 మందికిపైగా క్షతగాత్రులు అయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి. హతయ్ ప్రావిన్స్లో శిధిలాల కింద చిక్కుకుపోయిన ఓ ఏడేళ్ల చిన్నారిని సహాయక సిబ్బంది రక్షించారు. బయటికి వచ్చిన ఆ బాలిక వెంటనే తన తల్లి కూడా అక్కడే ఉందని చెప్పి ఆరాటపడడం.. అందరినీ ప్రశ్నించడంతో వారికి ఏం చెప్పాలో పాలుపోలేదు.
భవనాల కింద కొన్ని గంటల పాటు చిక్కుకున్న చిన్నారులను సహాయక సిబ్బంది రక్షించారు. ఒకే పట్టణంలోని రెండు వేరువేరు చోట్ల ఇద్దరు చిన్నారులను రెస్క్యూటిమ్ కాపాడింది. జిందేరీస్ పట్టణంలోని ఓ భవనంలో ఇద్దరు చిన్నారులు భవన శిధిలాలలో చిక్కుకుపోగా వారిని రెస్క్యూటిమ్ సురక్షితంగా బయటికి తీసుకువచ్చింది. నూర్ అనే చిన్నారి ఈ సహాయక చర్యల్లో శిధిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడింది. జిందెరిన్ పట్టణంలో మరో బాలుడు హరుణ్ ని కూడా ఇదే రీతిలో రక్షించారు.
ఇదిలా ఉండగా, టర్కీ, సిరియాల్లో విలయం సృష్టించిన భూకంపాన్ని ముందే ఊహించారా? అంటే అవుననే తెలుస్తోంది. మూడు రోజుల ముందుగానే దీనికి సంబంధించి హెచ్చరిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పరిశోధకుడిగా నివేదించబడిన ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఫిబ్రవరి 3న దక్షిణ-మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ చుట్టూ ఉన్న ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు.
తన ట్వీట్‌లో, అతను ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించే మ్యాప్‌ను కూడా షేర్ చేశాడు. ఈ ట్విటర్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లోని తన బయోలో, హూగర్‌బీట్స్ తాను "భూకంప కార్యకలాపాలకు సంబంధించిన ఖగోళ వస్తువుల మధ్య జ్యామితిని పర్యవేక్షించే పరిశోధనా సంస్థ సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వేపరిశోధకుడిని" అని రాశారు.