Asianet News TeluguAsianet News Telugu

టర్కీ, సిరియా భూకంపాన్ని ముందే ఊహించారా? మూడు రోజుల ముందే చేసిన ట్వీట్ నిజమయిందా?

టర్కీయేలో సంభవించిన భూకంపం, 2,600 మందికి పైగా మరణించినట్లు అంచనా. దేశ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటి. అయితే దీన్ని ముందే ఊహించారా?

Did Turkey and Syria predict the earthquake three days ago? - bsb
Author
First Published Feb 7, 2023, 8:05 AM IST

టర్కీ : టర్కీ, సిరియాల్లో విలయం సృష్టించిన భూకంపాన్ని ముందే ఊహించారా? అంటే అవుననే తెలుస్తోంది. మూడు రోజుల ముందుగానే దీనికి సంబంధించి హెచ్చరిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పరిశోధకుడిగా నివేదించబడిన ఫ్రాంక్ హూగర్‌బీట్స్ ఫిబ్రవరి 3న దక్షిణ-మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ చుట్టూ ఉన్న ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు.

తన ట్వీట్‌లో, అతను ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించే మ్యాప్‌ను కూడా షేర్ చేశాడు. ఈ ట్విటర్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లోని తన బయోలో, హూగర్‌బీట్స్ తాను "భూకంప కార్యకలాపాలకు సంబంధించిన ఖగోళ వస్తువుల మధ్య జ్యామితిని పర్యవేక్షించే పరిశోధనా సంస్థ సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వేపరిశోధకుడిని" అని రాశారు.

టర్కీలో భారీ భూకంపం..2600లకు చేరిన మరణాల సంఖ్య.. ప్రధానిమోడీ సంతాపం

టర్కీయే భూకంపం తర్వాత, "సెంట్రల్ టర్కీలో సంభవించిన భారీ భూకంపం తనను కలిచివేసిందని.. దీనివల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరికి కోసం నా హృదయం కొట్టుకుంటోంది’ అని ట్వీట్ చేశాడు.
"నేను ఇంతకు ముందే త్వరలోనే భూకంపం వస్తుందని చెప్పానని.. అది 115,  526 సంవత్సరాల మాదిరిగానే ఉండబోతుందని చెప్పానని.. ఈ భూకంపాలు ఎప్పుడూ క్లిష్టమైన గ్రహ సంబంధిత రేఖాగణితంతో ముందే అంచనా వేశామన్నారు. అంతేకాదు ఒకదాని వెంట మరొకటిగా మరిన్ని భూప్రకంపనలు వస్తాయని ఆయన చెప్పారు. అలాగే జరిగింది. 

భారీ భూకంపం : టర్కీ, సిరియాల్లో 300మందికి చేరిన మృతుల సంఖ్య.. నిద్రలోనే మృత్యుఒడికి...

విపత్తులో చిక్కుకున్న దేశాన్ని ఆదుకునేందుకు అంతర్జాతీయ సంఘాలు ముందుకొచ్చాయి. అనేక దేశాలు సహాయక సిబ్బందిని పంపేందుకు ముందుకు వచ్చాయి. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ భూకంపాలను చారిత్రాత్మక విపత్తుగా పేర్కొన్నాడు. 1939 తర్వాత దేశంలో సంభవించిన అత్యంత భయంకరమైన భూకంపం అని, అధికారులు వారు చేయగలిగినదంతా చేస్తున్నారని చెప్పారు.

"చలికాలం, చల్లని వాతావరణం, రాత్రి సమయంలో సంభవించే భూకంపం విషయాలను మరింత కష్టతరం చేస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు’ అని అతను చెప్పాడు.

కానీ, ఫ్రాంక్ హూగర్ బీట్స్ చేసిన ముందస్తు హెచ్చరికల మీద పలువురు అనేక విమర్శలు చేశారు. గతంలో కూడా ఆయన ఇలాగే అంచనాలు వేశారని, కానీ నిజం కాలేదని నెటిజన్లు కామెంట్స్ చేశారు. అంతేకాదు భూకంపాలను ఖచ్చతంగా అంచనా వేసే విధానం ఏదీ అందుబాటులో లేదని విమర్శించారు. కానీ ఇప్పుడాయన చెప్పింది నిజం కావడంతో ఫ్రాంక్ ట్వీట్లను ప్రస్తుతం లక్షలాది మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios