Asianet News TeluguAsianet News Telugu

జకార్తాలో భూకంపం.. 20 మంది మృతి.. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రత నమోదు..

జకర్తాలో భూకంపం సంభవించింది. దీని వల్ల 20 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 5.6 గా నమోదు అయ్యింది. 

Earthquake in Jakarta.. 20 people died.. 5.6 magnitude on the Richter scale..
Author
First Published Nov 21, 2022, 2:41 PM IST

ఇండోనేషియా రాజధాని జకార్తాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.6 గా నమోదు అయ్యింది. ఈ భూకంపం వల్ల భవనాలు కంపించాయని ఏఎఫ్ పీ నివేదించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం జకార్తాకు దక్షిణాన ఉన్న పట్టణాల సమీపంలో సంభవించింది.

ఢీల్లీ లిక్కర్ స్కాం: బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లకు బెయిల్ మంజూరు

ఈ భూకంపం వల్ల 20 మంది చనిపోయారు. 300కు పైగా ప్రజలు గాయపడ్డారు. అయితే భూ ప్రకంపనలు మొదలైన వెంటనే భనవాల్లో నివసించే ప్రజలు భయపడుతూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. అలాగే ఏఎఫ్ పీ జకార్తాలోని తమ ఆఫీస్ టవర్ లో పనిచేస్తున్న జర్నలిస్టులను ఖాళీ చేయాలని సూచించింది. ఇండోనేషియా పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’పై స్థానం కారణంగా తరచుగా భూకంపలు సంభవిస్తాయి. 

ఇదిలా ఉండగా నేటి ఉదయం గ్రీస్‌లోని క్రీట్‌ లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 5.5 మాగ్నిట్యూడ్ గా నమోదయ్యింది. దీంతో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. అందుకే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాలని కోరింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, సోమవారం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.25 గంటలకు గ్రీస్‌లోని సిటియాకు ఈశాన్య దిశలో 60 కిమీ (37 మైళ్ళు) భూకంపం సంభవించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios