Earthquake: బంగ్లాదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రత నమోదు
Bangladesh earthquake: బంగ్లాదేశ్ లో భూకంప సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.5గా నమోదైందనీ, పెద్దగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Earthquake jolts Dhaka: బంగ్లాదేశ్ లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. కుమిల్లాలోని రామ్ గంజ్ లో ఉదయం 9:35 గంటలకు ఢాకా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని బంగ్లాదేశ్ వాతావరణ శాఖకు చెందిన వాతావరణ నిపుణుడు రుబాయెత్ కబీర్ తెలిపినట్టు 'ది డైలీ స్టార్' నివేదించింది.
రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.5గా నమోదైందనీ, పెద్దగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందనీ, రామ్ గంజ్ కు తూర్పు ఈశాన్యంగా 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్టు యూఎస్ జీఎస్ తెలిపింది.
చటోగ్రామ్, సిరాజ్గంజ్, నార్సింగి, సిల్హెట్, ఖుల్నా, చాంద్ పూర్, మదారిపూర్, రాజ్షాహి, బ్రహ్మన్బారియా జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనలు క్రమంలో ఏం జరుగుతుందోనని ప్రజలు ఇండ్లు, ఆఫీసుల నుంచి బటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ తెలిపింది.