సోషల్ మీడియాలో ట్రిపుల్ తలాక్.. దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా సంచలనం
Dubai Princess Shaikha Mahra : రాజుకు దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో ముస్లిం భర్తలకు ప్రబలంగా ఉన్న సాంప్రదాయ పద్ధతి ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది.
Dubai Princess Shaikha Mahra : దుబాయ్ ప్రిన్సెస్ షేక్ మెహ్రా తన భర్తకు విడాకులు ఇచ్చింది. దుబాయ్ యువరాణి కుమార్తె షేఖా మహరా బింట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన భర్త షేక్ మనా నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో బహిరంగంగా ప్రకటించారు. ముస్లిం సమాజంలో పురుషుల అధిక్యంలో ఎక్కువగా కనిపించే ట్రిపుల్ తలాక్ తో ఆమె తన విడాకులు తీసుకున్నారు.
మీడియా నివేదికల ప్రకారం, ముస్లిం భర్తలకు ప్రబలంగా ఉన్న సాంప్రదాయ పద్ధతి ప్రకారం దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌ను ప్రకటించారు. తన పోస్టులో 'ప్రియమైన భర్త, మీరు ఇతర భాగస్వాములతో బిజీగా ఉన్నందున, నేను విడాకులు ప్రకటిస్తున్నాను. నేను మీకు విడాకులు ఇస్తున్నాను, నేను మీకు విడాకులు ఇస్తున్నాను.. నేను మీకు విడాకులు ఇస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య' అంటూ ట్రిపుల్ తలాక్ చెప్పారు. ఆమె పోస్ట్‌ను 40,000 మందికి పైగా లైక్ చేసారు, ఇంకా చాలా మంది యువరాణికి మద్దతుగా నిలిచారు.
ఎమిరాటీ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌తో షేక్ మెహ్రా గత ఏడాది మేలో వివాహం చేసుకున్నారు . ఒక సంవత్సరం తరువాత ఇప్పుడు విడాకులతో వార్తల్లో నిలిచారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. షేక్ మెహ్రా తండ్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యూఏఈ ఉపాధ్యక్షుడిగా, ప్రధానిగా, రక్షణ మంత్రిగా ఉన్నారు. దుబాయ్ పాలకుడి 26 మంది సంతానంలో షేక్ మెహ్రా ఒకరు. అతని తల్లి జో గ్రిగోరాకోస్ గ్రీస్కు చెందినది.