దుబాయ్ పాలకుడి భార్య.. తన బాడీగార్డ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా.. అతనికి ఎప్పుడు కావాలంటే.. అప్పుడు నగదు బహుమతులు ఇవ్వడం.. ఖరీదైన గిఫ్ట్స్ కూడా ఇచ్చేదట. దాదాపు రూ.9కోట్లపైనే నగదు అతనికి ఇవ్వడం గమనార్హం. కాగా.. వీరి అక్రమ సంబంధం వ్యవహారం ఎన్నో సంవత్సరాలుగా గడుస్తున్నా.. తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్లుగా బాడీగార్డ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతను బ్రిటీష్ బాడీగార్డ్ కాగా.. అతని పేరు రస్సెల్ ఫ్లవర్స్. అయితే.. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు అతనికి భారీగా నగదు ఇచ్చినట్లు సమాచారం.

దీని గురించి రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2మిలియన్‌ డాలర్ల నగదు(రూ. 8,88,59,400)తోపాటు 12 వేల డాలర్ల విలువైన వాచ్‌, అరుదైన షాట్‌గాన్‌ ఇచ్చినట్లు మెయిల్‌ ఆన్‌లైన్‌ వెల్లడించింది.

 రస్సెల్‌ భార్య మాట్లాడుతూ.. ‘హయా నా భర్తకు భారీ ఎత్తున నగదు, ఖరీదైన బహుమతలు ఇచ్చి లొంగదీసుకుంది.. తనని ఆమె దగ్గరే ఉంచుకుంది’ అని తెలిపింది. వీరిద్దరి బంధం గురించి తెలియడంతో రస్సెల్‌ భార్య ఎంతో బాధపడిందని.. వారి నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికేందుకు సిద్దమయ్యిందని మెయిల్‌ ఆన్‌లైన్‌ తెలిపింది.

ప్రిన్సెస్‌ హయా, ఆమె 70 ఏళ్ల మాజీ భర్త మధ్య హైకోర్టు విచారణ సందర్భంగా బాడీగార్డుతో ఆమెకున్న రహస్య సంబంధం వెలుగులోకి వచ్చింది. లండన్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్‌లో భాగంగా ఈ వివరాలు వెలువడ్డాయి. ప్రిన్సెస్‌ హయా తన మగ అంగరక్షకులలో ఒకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని దీనిలో పేర్కొన్నారు. ప్రస్తుతం హయా తన ఇద్దరు పిల్లలతో వెస్ట్‌ లండన్‌లోని కెన్సింగ్టన్‌లో నివాసం ఉంటున్నారు.