భర్తను వదిలిపెట్టి భార్య వెళ్లిపోవడం సామాన్యుల విషయాల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏకంగా దేశాధినేతల విషయంలో జరిగితే.. అది కూడా కఠిన చట్టాలు ఉండే ముస్లిం దేశాల్లో జరిగితే..

దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తామ్.. ఆరో భార్య, జోర్డాన్ రాజుకు సవతి సోదరి అయిన హయా బింత్ అల్ హుస్సేన్ రూ.270 కోట్లకుపైగా సంపదతో పాటు తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.

కొద్దికాలం క్రితం మొహమ్మద్ బిన్‌ను నుంచి హయా విడాకులు కోరింది. దుబాయ్‌లో తనకు ప్రాణహానీ ఉందని భావించి తనకు ఆశ్రయం కావాలంటూ జర్మనీని కోరినట్లు   తెలుస్తోంది.

తర్వాత ఓ జర్మనీ దౌత్యవేత్త సాయంతో మొదట జర్మనీకి వెళ్లిపోయిందని రాజు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అయితే ఆక్స్‌ఫర్డ్ చదువుకున్న హయా.. లండన్‌కు వెళ్లిపోయి ఉండొచ్చని రాజకుటుంబానికి సన్నిహితులు తెలిపినట్లుగా తెలుస్తోంది.