దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతిచెందారు.

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతిచెందారు. ఈ మేరకు అత్యవసర సేవల అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య 43కి చేరుకుందని అధికార ప్రతినిధి రాబర్ట్ ములౌద్జీ తెలిపారు. ‘‘మేము 52 మృతదేహాలను. 43 మందికి స్వల్ప గాయాలయ్యాయి’’ అని చెప్పారు. 

అత్యవసర సేవలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎస్‌ఏబీసీ నివేదించింది. అయితే మంటలు చాలా వరకు ఆరిపోయాయని అధికారులు తెలిపారు. అయితే బిల్డింగ్ కిటికీల నుంచి పొగలు ఇంకా బయటకు వస్తున్నాయని చెప్పారు. ఇక, అగ్నిమాపదం చోటుచేసుకున్న బిల్డింగ్ వెలుపల భారీగా అంబులెన్స్‌లను మోహరించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇప్పటివరకు తెలియరాలేదు. 

Scroll to load tweet…