Asianet News TeluguAsianet News Telugu

ఇతర ఉగ్రవాదులను రవాణా చేయవద్దు.. క్యాబ్ డ్రైవర్‌లకు తాలిబాన్ల ఆదేశం

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు విచిత్ర ఆదేశాలు జారీ చేశారు. తాలిబాన్లను లేదా తాలిబాన్ సంబంధ సంస్థ సభ్యులను ట్యాక్సీలో తీసుకెళ్లాలని, ఆయుధాలు పట్టుకుని ఇతరులెవరు కనిపించినా ట్యాక్సీల్లో రవాణా చేయవద్దని డ్రైవర్లను ఆదేశించారు. నంగర్‌హర్ ప్రావిన్స్‌లో తాలిబాన్లు ఈ ఆదేశాలు వెలువరించారు.
 

dont transport gunmen says taliban in afghanistan
Author
New Delhi, First Published Nov 7, 2021, 6:26 PM IST

న్యూఢిల్లీ: Afghanistanలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. Terroristలే అధికారంలోకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు Talibansతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలూ ఉండేవి. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఉగ్రవాద సంస్థల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అంటే అధికారంలోని తాలిబాన్లకు ఐఎస్ఐఎస్-కే మధ్య చిచ్చు రగులుతున్నది. అష్రఫ్ ఘనీ ప్రభుత్వం ఉనికిలో ఉన్నప్పటి నుంచే తాలిబాన్లకు, ఐఎస్ఐఎస్-కే మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ రెండు సంస్థల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉన్నది. అప్పటి అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఈ రెండు ఉగ్రవాద సంస్థలు పోటాపోటీగా దాడులు
జరిపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నంగర్‌హన్ ప్రావిన్స్‌లో క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. తాలిబాన్లు, తాలిబాన్లతో సఖ్యత ఉన్న ఉగ్రవాదులు లేదా సాయుధులను మాత్రమే రవాణా చేయాలని, ఇతర సాయుధులను రవాణా చేయవద్దని ఆదేశించారు.

కానీ, గతేడాది ఆగస్టులో అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రభుత్వంతో తాలిబాన్ల 20 ఏళ్ల యుద్ధం ముగిసింది. కానీ, తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సాధారణ పౌరులను హతమారుస్తూ పేలుళ్లు ఆగలేదు. ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాద సంస్థ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హర్ ప్రావిన్స్‌లో ఈ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యం అధికంగా ఉన్నది. ఇప్పుడు ఐఎస్ఐఎస్-కే(ISIS-K) ఉగ్రవాద సంస్థకు ముకుతాడు వేయడానికి తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నంగర్‌హర్ ప్రావిన్స్‌లో Taxi Driverలకు సరికొత్త ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Afghanistan: తొమ్మిదేళ్ల కూతురిని అమ్మేసిన తండ్రి.. ‘బతకాలంటే తప్పట్లేదు’

నంగర్‌హర్ ప్రావిన్షియల్ కార్యాలయం నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. నంగర్‌హర్ ప్రావిన్స్ భద్రత కోసం, శాంతి భద్రతల కోసం ప్రజలు సహకరించాలని తాలిబాన్లు కోరారు. ఇందులో భాగంగా ట్యాక్సీ డ్రైవర్లు తాలిబాన్లు, తాలిబాన్ సంబంధ సంస్థ సభ్యులను మాత్రమే ఎక్కించుకుని రవాణా చేయాలని ఆదేశించారు. ఇతర అనుమానిత సాయుధులను ఎట్టి పరిస్థితుల్లో తీసుకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎవరైనా అనుమానిత సాయుధులు ట్యాక్సీల్లో కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

నంగర్‌హర్ ప్రావిన్స్‌లో ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాద సంస్థ క్రియాశీలంగా ఉన్నది. అందుకే ఈ ప్రావిన్స్‌లోనే తాలిబాన్లు ప్రత్యేక ఆదేశాలు వెలువరించారు. అయితే, ఈ ఆదేశాల్లో ఆ ఉగ్రవాద సంస్థ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

Also Read: Taliban: ‘పెళ్లి విందులో మ్యూజిక్ ఆపడానికి 13 మందిని కాల్చి చంపారు’

నంగర్‌హర్ ప్రావిన్స్‌లో తాలిబా న్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరుగుతున్నాయి. పేలుళ్లు, తుపాకీ కాల్పులు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. అంతేకాదు, ఈ ప్రావిన్స్‌లో ఉదయం పూట మృతదేహాలు చెట్లకు వేలాడుతూ కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు, తలలు నరికి కనిపిస్తున్నాయని తెలిపారు. కానీ, ఈ ఘటనల్లో బాధితులు లేదా హంతకుల గురించి తెలియడం లేదని వివరించారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు అష్రఫ్ ఘనీ ప్రభుత్వంతో తాలిబాన్లు యుద్ధం చేశారు. అమెరికా మద్దతు ఉన్న ఈ ప్రభుత్వం కూలిపోయాక తాలిబాన్లు అధికారాన్ని చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios