2021కి ముందు కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు: డబ్ల్యు హెచ్ ఓ
2021 కంటే ముందుగానే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగదశ ఫలితాలు సానుకూలంగా ఉన్న విషయాన్ని డబ్ల్యు హెచ్ ఓ గుర్తు చేసింది.
జెనీవా: 2021 కంటే ముందుగానే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగదశ ఫలితాలు సానుకూలంగా ఉన్న విషయాన్ని డబ్ల్యు హెచ్ ఓ గుర్తు చేసింది.
కరోనాను అరికట్టేందుకు అవసరమైన వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి వివక్షకు తావు ఉండదని డబ్ల్యు హెచ్ ఓ ఎమర్జెన్సీ విభాగం అధిపతి మైక్ ర్యాన్ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ ను ప్రతి ఒక్కరి కోసం అవసరమని ఆయన చెప్పారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం సంపద కోసమో, పేదల కోసమో కాదన్నారు. మానవాళి మనుగడ కోసమే ఈ వ్యాక్సిన్ అవసరమని తెలిపింది.
కరోనా నిరోధించేందుకు ప్రపంచంలోని పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నిస్తున్నాయి. పలు సంస్థల ప్రయోగాలు సక్సెస్ అయినట్టుగా ఆయా సంస్థలు తెలిపాయి. కొన్ని సంస్థల క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి.
also read:24 గంటల్లో 50 వేలకు చేరువలో కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 12,38,635కి చేరిక
ఆక్స్ ఫర్డ్ సంస్థ మొదటి దశ ట్రయల్స్ విజయవంతమైనట్టుగా ఇటీవలనే ప్రకటించింది. 2021 వరకు ప్రజలకు టీకా వేయడం సాధ్యం కాకపోవచ్చని ఆయన మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి తారతమ్యాలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు.
ఫిజర్ ఐఎన్‌సీ, జర్మన్ బయోటెక్ బయోఎన్‌టెక్ తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సురక్షితం, ప్రభావంతమైనదని నిరూపిస్తే 1.95 బిలియన్ డాలర్లు వెచ్చించి 100 మిలియన్ డోసులు కొనుగోలు చేస్తామంటూ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా తదితర దేశాల్లో పాఠశాలల పునఃప్రారంభం గురించి మైక్ మాట్లాడుతూ.. కోవిడ్-19 సామాజిక వ్యాప్తి నియంత్రణలోకి వచ్చేంత వరకు అటువంటి నిర్ణయం తీసుకోకపోవడమే మంచిదని పేర్కొన్నారు.
అమెరికన్ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాలు ఈ నెల 27న మొదలు కానున్నాయి. అదే విధంగా రష్యాలోని సెషనోవ్ యూనివర్సిటీ (టీకా ఆగస్టు రెండోవారానికల్లా అందుబాటులోకి రానుందనే ప్రచారం సాగుతోంది.