వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆయన సోదరి మేరీనా  ట్రంప్ బారీ  బారీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్  క్రూరుడని, అబద్దాల కోరు అని ఆమె అభివర్ణించారు. అతడిని నమ్మలేమని ఆమె పేర్కొంది.  రహస్యంగా ఆమె మాటలను రికార్డు చేసినట్టుగా మీడియా ప్రకటించింది.

సరిహద్దుల వద్ద తల్లిదండ్రులను పిల్లలను వేరు చేసి నిర్భంధ కేంద్రాలకు పంపిన ఇమ్మిగ్రేషన్ విధానంపై ఆమె మండిపడ్డారు.  తన సిద్దాంతాల కోసం ఎవరిని లెక్క చేయడని, అతను మాట్లాడే ప్రతి మాట కూడ అబద్దమేనని ఆమె చెప్పింది. ఆయన చేసే ట్వీట్లు కూడ అదే విధంగా ఉంటాయని ఆమె చెప్పారు. 

ట్రంప్ మేనకోడలు రాసిన టాక్సిక్ ఫ్యామిలీ పబ్లికేష్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆమె ఆరోపించింది. ఈ పుస్తకం ఇప్పటికే 9లక్షల 50వేల కాఫీలు అమ్ముడయ్యాయని.. కానీ వైట్‌ హౌస్‌ మాత్రం అది ఒక అబద్దాల పుస్తకం అంటూ తప్పడు ప్రచారం చేశారన్నారు.

తనకు అడ్డుగా నిలిచేవారిపై ఎంత దూరం వెళ్లేందుకైనా ట్రంప్ వెనుకాడడని ఆమె ఆరోపించారు. ఇది ట్రంప్ మూర్కత్వాన్ని చూపుతోందన్నారు. ఈ విషయాన్ని తాను మేరీకి వివరించినట్టుగా మేరీనా ట్రంప్ బారీ చెప్పారు.  పెన్సిల్వేనియాలో ప్రవేశం పొండానికి వేరే వ్యక్తితో ట్రంప్ పరీక్ష రాయించాడని ఆమె ఆరోపించారు. పరీక్ష రాసిన వ్యక్తి పేరు తనకు ఇంకా గుర్తుందన్నారు. 

ఈ విషయమై రిపబ్లికన్ పార్టీ స్పందించింది. ట్రంప్ ను ఓడించేందుకు ఇలాంటి కుట్రలకు పన్నారని రిపబ్లికన్ పార్టీ ఆరోపించింది.