Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ నాకోసం లేఖ రాశారు.. జో బైడెన్

కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని ట్రంప్ కొనసాగించడం సంతోషం అని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడికి విషెస్ చెబుతూ.. ప్రెసిడెంట్‌కు మద్దతుగా ఉంటానని, ఆయన పదవీ కాలాన్ని ప్రశాంతంగా ముగించాలని కోరుకుంటున్నట్లు లేఖలో ట్రంప్ పేర్కొన్నారని సమాచారం. 

Donald Trump "Wrote A Very Generous Letter": Joe Biden
Author
Hyderabad, First Published Jan 21, 2021, 10:45 AM IST


అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా.. నిన్నటితో డోనాల్డ్ ట్రంప్ పదవీ కాలం ముగిసింది. కాగా.. వెళిపోతూ ట్రంప్ కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని కొనసాగించారు. శ్వేతసౌధాన్ని వీడుతూ ఓవల్ కార్యాలయంలో ఓ లేఖను విడిచి వెళ్లారు. ఈ విషయాన్ని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్ వైట్ హౌస్ వద్ద మీడియాతో తెలిపారు. 

కొత్త అధ్యక్షుడికి లేఖ రాసే ఆనవాయితీని ట్రంప్ కొనసాగించడం సంతోషం అని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడికి విషెస్ చెబుతూ.. ప్రెసిడెంట్‌కు మద్దతుగా ఉంటానని, ఆయన పదవీ కాలాన్ని ప్రశాంతంగా ముగించాలని కోరుకుంటున్నట్లు లేఖలో ట్రంప్ పేర్కొన్నారని సమాచారం. 

ఇదిలాఉంటే.. బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ట్రంప్ హాజరుకాని విషయం తెలిసిందే. ఉపాధ్యక్షుడిగా పని చేసిన మైక్‌ పెన్స్‌ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వెళ్లిపోయారు. అధ్యక్ష హోదాలోనే ట్రంప్ నిష్క్రమణ జరగడం గమనార్హం. ఇక పటిష్టమైన భద్రతా నడుమ 78 ఏళ్ల జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 25వేల మంది నేషనల్‌ గార్డ్స్‌ పహారాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 

ప్రమాణస్వీకారం అనంతరం బైడెన్ మాట్లాడుతూ కొత్త శకం మొదలైంది.. ఇది ప్రజాస్వామ్య విజయం.. తాను అమెరికన్లందరికీ అధ్యక్షుడినని పేర్కొన్నారు. దేశాన్ని ఏకతాటిపై తేవడం, కరోనాపై విజయం దిశగా చర్యలు చేపట్టడం, వ్యక్తిగత లాభం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని బైడెన్ అన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios