Asianet News TeluguAsianet News Telugu

పీకల్లోతు అప్పుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారాల్లో మునిగితేలిన ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక కూడా వ్యాపారవేత్తగానే ప్రవర్తించారు. ఇప్పటికే ట్రంప్ దాదాపు వందకోట్ డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోయాడట. అంటే సుమారు 7,300 కోట్ల రూపాయలు. 

donald trump will have financial debt over companies, USA - bsb
Author
Hyderabad, First Published Feb 1, 2021, 1:13 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారాల్లో మునిగితేలిన ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక కూడా వ్యాపారవేత్తగానే ప్రవర్తించారు. ఇప్పటికే ట్రంప్ దాదాపు వందకోట్ డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోయాడట. అంటే సుమారు 7,300 కోట్ల రూపాయలు. 

దీన్నుండి ట్రంప్ ను బయటపడేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాపిటల్‌ హిల్‌పై దాడి తరువాత ట్రంప్ మీద విత్త సంస్థల దృక్పథంలో మార్పు వచ్చింది. ఈ కారణంగా రుణ విముక్తి అంత తేలిగ్గా జరగకపోవచ్చని భావిస్తున్నారు. 

ఇప్పటికే అమెరికాలోని పలు చిన్నా, పెద్ద బ్యాంకులు ట్రంప్ తో, ఆయన కంపెనీలతో సంబంధాలు తెంచుకన్నాయి. కానీ డాయిష్ బ్యాంకు మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

అయితే, తాజాగా ఈ బ్యాంకు కూడా ట్రంప్‌తో వ్యాపారానికి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. చివరికి చిన్నబ్యాంక్ అయిన సిగ్నేచర్ బ్యాంకు కూడా ట్రంప్, ఆయన కంపెనీలవి అకౌంట్లను క్లోజ్‌ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ కు బ్యాంకుల నుంచి రుణాలు దొరికే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఒక వేళ ట్రంప్ ఆస్తులు అమ్మి ఈ ఊబిలోనుండి బయటపడాలని చూసినా కుష్‌మన్‌ అండ్‌ వాక్‌ఫీల్డ్, జేఎల్‌ఎల్‌లాంటి బ్రోకరింగ్ దిగ్గజాలు కూడా ట్రంప్ తో వ్యాపార సంబంధాలు తెంచుకున్నాయి. అందువల్ల ఆస్తుల అమ్మకాలు కూడా కష్టంగా మారే ఛాన్సులున్నాయి. పైగా ఆయన ఆస్తుల్లో ఎక్కువ భాగం డెమొక్రాట్లు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ కారణంతోనే ట్రంప్ ఆర్గనైజేషన్‌ ఈ వ్యవహారాలపై ఎలాంటి ప్రకటనలు చేయడంలేదు. 

అయితే ఇదిలా ఉంటే.. సొంత దేశంలో ట్రంప్‌నకు సాయం లభించడం కష్టం అని చాలామంది అనుకుంటుంటే, కొందరు మాత్రం అధ్యక్షుడిగా ఇన్నాళ్లు పని చేయడం వల్ల వ్యాపార విస్తరణ అవకాశాలు పెరిగాయని, అందుకే స్వదేశంలో ఇబ్బందులు ఎదురైనా విదేశాల్లో పెట్టుబడులు, వ్యాపారాలు బాగా కొనసాగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. 

బ్రెజిల్, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండియాలాంటి దేశాల్లో ట్రంప్ కు ఇంకా పాపులారిటీ ఉందని, ఆయా దేశాధినేతలతో ట్రంప్ కు సత్సంబంధాలే ఉన్నాయని వీరు గుర్తు చేస్తున్నారు. అలాగే ఇటీవలి కాలంలో పలు అరబ్‌ దేశాలతో ట్రంప్ టీమ్ మంచి సంబంధాలు నెలకొల్పుకుంది.

అంతేకాదు యూఏఈ, సౌదీల్లో ట్రంప్ కంపెనీలకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఇందుకు నిదర్శనంగా ట్రంప్‌ కంపెనీలతో వ్యాపార విస్తరణకు ఆసక్తిగా ఉన్నామని దుబాయ్‌ డీఏఎంఏసీ ప్రాజెక్ట్ చైర్మన్ వ్యాఖ్యలను నిపుణులు గుర్తు చేస్తున్నారు. 

విదేశీ వాణిజ్య సంబంధాలు బలంగా కొనసాగిస్తేనే ట్రంప్‌ కంపెనీలు రుణాల నుంచి విముక్తి పొందే ఛాన్సులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ట్రంప్‌ ఏదైనా చేయగలడని, అప్పుల్లోంచి ఈజీగా బయటపడడం గతంలో కూడా చేశాడని గడుసుగాడే అని వ్యాఖ్యానిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios