Donald Trump: గత వారం ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధవిరమణ చర్చలు, బందీలు బదిలీ అవకాశాలు చోటు చేసుకున్నా గాజాలో హింస ఆగలేదు. అంతర్గతంగా పరిస్థితి ఉద్వేగంగా మారుతోంది. 

సాధారణ ప్రజలపై దాడులు ఆగడం లేదు

గూఢచర్యం, అనుమానిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులను హమాస్ పబ్లిక్‌గా హతం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు పలు పాలెస్టీనియన్లు బలిగొన్నట్టు సమాచారం. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్రంప్ ఆగ్రహం, కఠిన హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోష‌ల్ మీడియాలో ఈ విష‌య‌మై స్పందించారు. గాజాలో సాధారణ ప్రజలను చంపడం కొనసాగితే అమెరికాకు ఆప్ష‌న్స్ త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఇదే కొన‌సాగితే హ‌మాస్ యోధుల‌ను గాజాలో టార్గెట్ చేయాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

చర్చల నిబంధనలు ఉల్లంఘిస్తే.. అమెరికా ఇజ్రాయెల్‌కు కొత్త దాడులలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలతో అమెరికా ప్రత్యక్ష సైనిక చర్యకు దిగనుందా అన్న చ‌ర్చ న‌డుస్తోంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ..గాజాలో సైన్యాన్ని మోహ‌రించే ఆలోచ‌న ప్ర‌స్తుతానికి లేద‌న్నారు. ప్రస్తుతం సుమారు 200 అమెరికా సైనికులు ఇజ్రాయెలో ఉన్నారు. వారు యుద్ధవిరమణ నిబంధనలు పరిశీలించడానికి మాత్రమే ఉన్నార‌ని చెప్పుకొచ్చారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెటన్యాహూ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ఒప్పందం నుంచి వెనక్కు తగ్గనుందని, హ‌మాస్ ఒప్పంద నిబంధనలు పాటించాలని ఆయన అన్నారు. మొత్తం మీద గాజా పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉంది. అంతర్గత హింస కొనసాగితే పరిస్ధితులు మరింత తీవ్రతరమవుతాయని భావిస్తున్నారు.