Donald Trump: లెనిన్‌గ్రాడ్ పేరు మార్చి దశాబ్దాలు గడిచినా, ట్రంప్ పాత పేరుతో వ్యాఖ్యలు చేయడంతో మతిమరుపు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నిజంగానే అమెరికా అధ్యక్షునికి మతిమరుపు వచ్చిందా?
KNOW
Donald Trump: 79 ఏళ్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉదయం ట్రూత్ సోషల్‌లో చేసిన ఒక పోస్ట్ ఆయన మతిమరుపు ఆరోపణలను మరింతగా పెంచింది. "ఒకవేళ నేను రష్యా ఒప్పందంలో భాగంగా మాస్కో, లెనిన్‌గ్రాడ్‌లను ఉచితంగా పొందితే, నేను ఒక చెడ్డ ఒప్పందం చేసుకున్నానని 'ఫేక్ న్యూస్' చెబుతుంది!" అని ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు. అందులో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరగబోయే సమావేశంపై మీడియా కవరేజీ గురించి ఆయన ఎత్తిచూపారు. అయితే, ఇక్కగ గమనించాల్సిన విషయం ఏమిటంటే లెనిన్‌గ్రాడ్ అనే పేరు 1991లో మార్చారు. ఆ సంవత్సరంలో నగర ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పాత చారిత్రక పేరును ‘సెయింట్ పీటర్స్‌బర్గ్’ తిరిగి పెట్టారు.
రష్యా వ్యాపార సంబంధాలలో ట్రంప్
1987లో ట్రంప్ తన భార్య ఇవానాతో కలిసి మాస్కో, లెనిన్‌గ్రాడ్ పర్యటించారు. రష్యా రాజధానిలో ట్రంప్ హోటల్ నిర్మాణంపై చర్చలు జరిపారు. అయితే ఆ ప్రాజెక్టులు విఫలమయ్యాయి. తర్వాత కూడా ఆయన రష్యా డెవలపర్లను కలిసే ప్రయత్నాలు చేశారు.
పుతిన్ సమావేశం ముందు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రంప్-పుతిన్ సమావేశం త్వరలో అలాస్కాలో జరగనుంది. సమావేశంలో ఉక్రెయిన్ భవిష్యత్తుపై చర్చలు జరగనున్నాయి. ట్రంప్ గత కొన్ని వారాలుగా పలుమార్లు మాట తప్పడం, తప్పు పేర్లు చెప్పడం, గత నిర్ణయాలను మర్చిపోవడం వంటి ఘటనలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఉదాహరణకు, జెరోమ్ పావెల్‌ను ఫెడ్ చైర్‌గా బైడెన్ నియమించారని ఆరోపించినా, వాస్తవానికి 2017లో ఆయననే ఆ నియామకం చేశారు.
ప్రజా వేదికల్లో ట్రంప్ మతిమరుపు సమస్యలు
ఒక కార్యక్రమంలో యాపిల్ కంపెనీ అమెరికాలో $100 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంలో "స్కాట్ బెసెంట్, హోవర్డ్ లుట్నిక్ ఎక్కడ ఉన్నా ధన్యవాదాలు" అన్నారు. లుట్నిక్ వెనుకనే నిలబడి ఉన్నారని చెప్పగానే "అయ్యో, మీరు ఇక్కడే ఉన్నారా" అని ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఇది ఆయన ఇటీవల చేసిన WWE స్టార్ ట్రిపుల్ హెచ్ పరిచయం సమయంలో కూడా కనిపించింది. ట్రంప్ అతన్ని ఎదురుగానే పెట్టుకుని వెతుకుతూ మాట్లాడారు.
ట్రంప్ తీరుపై నిపుణుల ఏమంటున్నారు?
అమెరికా నిపుణుడు గార్ట్నర్ ప్రకారం.. ట్రంప్ నడక, కాళ్ల కదలికలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆయన కుడి కాలు “డెడ్ వెయిట్” లా సగం వలయం రూపంలో ఊగుతూ నడుస్తుందన్నారు. 1980ల్లో క్రీడల్లో చురుకుగా ఉన్న ట్రంప్, ఇప్పుడు మెట్లెక్కడం, నడకలో ఇబ్బంది పడుతున్నారని గార్ట్నర్ వ్యాఖ్యానించారు. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై ఆయన మేనకోడలు మేరీ ట్రంప్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
