Asianet News TeluguAsianet News Telugu

'డొనాల్డ్ ట్రంప్ మరణించారు.. ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా'.. ట్రంప్ కుమారుడి షాకింగ్  ట్వీట్.. ఏం జరిగిందంటే ?

Donald Trump: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఖాతాను హ్యాక్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ  ఖాతా నుండి ఓ సంచలన పోస్ట్ వెలువడటంతో అసలు విషయం తెలిసింది.  

Donald Trump Jr's X Account Briefly Hacked KRJ
Author
First Published Sep 21, 2023, 5:50 AM IST

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్  ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి..  డొనాల్డ్ ట్రంప్ నకు సంబంధించిన ఓ విషయం  ట్వీట్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాల్లో వైరల్‌ కావడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇది నెటిజన్లకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఈ సోర్టీ చదివేయండి.


పోస్ట్ ఏమిటి?

డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ ట్విట్టర్ ఖాతా సెప్టెంబరు 20 బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో  హ్యాకింగ్ కు గురైంది. ఆ తర్వాత ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. అందులో 'నా తండ్రి డొనాల్డ్ ట్రంప్ మరణించారని తెలియజేయడానికి బాధగా ఉంది. అందుకే.. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ కుమారుడి ఖాతాలో ఈ ట్వీట్ చేయడంతో చాలా మంది నెటిజన్లు ఆ వార్త నిజమని నమ్మేశారు. కానీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను దూషిస్తూ.. పలు పోస్టులు దర్శనమివ్వడంతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించారు.
 
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మరణ వార్తను పుకారుగా పేర్కొంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఖాతా నుండి మరిన్ని అభ్యంతరకరమైన పోస్ట్‌లు వచ్చాయి. అకౌంట్‌ ట్విటర్ ఖాతా హ్యాక్‌ అయినట్లు గుర్తించిన ఆయన టెక్నికల్ సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఈ పోస్ట్‌లు తర్వాత తొలగించబడ్డాయి. విచారణ అనంతరం డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడింది. అయితే అప్పటికే ఆ ట్వీట్లన్నీ స్క్రీన్ షాట్లు తీసి నెటిజన్లు సోషల్ మీడియాల్లో పెట్టడంతో వైరల్‌గా మారాయి.

Follow Us:
Download App:
  • android
  • ios