న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్ ట్రంప్  కొడుకు జూనియర్ ట్రంప్  ఫాక్స్ న్యూస్ హోస్ట్  కింబర్లీ గ్యూఫోయల్ తో  డేటింగ్ చేస్తున్నాడని  జూనియర్ ట్రంప్ మాజీ భార్య వెనెస్సా ట్రంప్ వెల్లడించారు. 

కింబర్లీకి ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. అయితే  ఏ కారణాలో తెలియదు కానీ, ఇద్దరు భర్తల నుండి ఆమె  విడాకులు తీసుకొంది.  ప్రస్తుతం జూనియర్ ట్రంప్ తో ఆమె డేటింగ్ చేస్తుందని  వెనెస్సా ప్రకటించారు.

వెనెస్సా ట్రంప్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయమై  గతంలో మీడియాలో అప్పుడప్పుడు వార్తలొచ్చేవి.  కానీ,వెనెస్సా ట్వీట్ చేయడం ద్వారా ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టుగా మారింది.

జూనియర్ ట్రంప్‌తో  కింబర్లీ డేటింగ్ చేస్తున్నందునే  ఆమెపై కొందరు విమర్శలు చేస్తున్నారని  వెనెస్సా అభిప్రాయపడ్డారు.  జూనియర్ ట్రంప్ నుండి తాను విడాకులు తీసుకొన్నప్పటికీ  ఒకరి నిర్ణయాలు మరోకరం గౌరవించుకొంటామని ఆయన చెప్పారు.  పిల్లల భవిష్యత్తు విషయంలో ఇద్దరం కలిసే నిర్ణయాలు తీసుకొంటామని వెనెస్సా చెప్పారు.