అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడింది. ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ ట్రంప్ తిరిగి రావడానికి సంబంధించి ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. ఈ పోల్‌లో ఎక్కువ మంది ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలని ఓటు వేయడంతో ఖాతా పునరుద్దించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడింది. ఎలోన్ మస్క్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. అంతకుముందు ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా?వద్దా? అని ట్విట్టర్‌లో పోల్ కూడా పెట్టాడు. అందులో చాలా మంది ఖాతా పునరుద్దరణకు ఓకే చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతా త్వరలో పునరుద్ధరించబడుతుందని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ తెలిపారు. అంతకుముందు.. మేలో ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధాన్ని ఎత్తివేయవచ్చని ప్రకటించారు.
ట్రంప్ ఖాతాపై వేటు ఎందుకు వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
గతేడాది అమెరికా పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ హిల్‌పై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. అమెరికాలో ఎన్నికల ఫలితాలు వచ్చి జో బిడెన్ చేతిలో ట్రంప్ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పలు వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ట్రంప్ ఖాతాపై నిషేధం విధించబడింది.
ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని ఎలోన్ మస్క్ నవంబర్ 19 న ఒక పోల్ నిర్వహించారు. ఇందులో 51.8 శాతం మంది వినియోగదారులు ఖాతా పునరుద్ధరించడానికి అనుకూలంగా ఓటు వేయగా, 48.2 శాతం మంది వినియోగదారులు ఖాతాను పునరుద్ధరించకూడదని ఓటు వేశారు. ఈ పోల్‌లో మొత్తం 1,50,85,458 మంది పాల్గొన్నారు. అదే సమయంలో పోల్‌ను 135 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు.
'ట్రంప్ ఖాతాపై నిషేధం నాకు ఇష్టం లేదు' : ఎలాన్ మస్క్
మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందు.. ట్రంప్‌తో సహా పలు ఖాతాలపై విధించిన ఆంక్షలను మూర్ఖపు వైఖరిగా పేర్కొన్నాడు.'శాశ్వత ఆంక్షలు చాలా తక్కువగా ఉండాలి. ఇది స్పామ్ లేదా స్కామ్ ఖాతాలకు ఆపాదించబడాలి. ట్రంప్ ఖాతాపై విధించిన నిషేధం సరైనదని తాను భావించడం లేదని పేర్కోన్నారు.
ట్రంప్ మళ్లీ ట్విట్టర్‌లోకి వస్తారా?
డొనాల్డ్ ట్రంప్ ఖాతా పునరుద్ధరించబడింది. అయితే ట్రంప్ .. గతంలో లాగా ట్విట్టర్ వేదికపై చురుకుగా ఉంటారా? ఈ ప్లాట్‌ఫారమ్‌కు తిరిగి వస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, తన ఖాతాను పునరుద్ధరించినా.. తాను ట్విట్టర్‌లోకి తిరిగి రానని ట్రంప్ గతంలోనే చెప్పారు. డొనాల్డ్ ట్రంప్‌కు ట్రూత్ సోషల్ అనే చిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉంది. ట్విట్టర్ అతన్ని బ్లాక్ చేసినప్పటి నుండి అతను దానిని ఉపయోగిస్తున్నాడు. శనివారం లాస్ వెగాస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ఎలోన్ మస్క్ పోల్ గురించి తనకు తెలుసునని, అయితే ట్విట్టర్‌తో చాలా సమస్యలను చూశానని బ్లూమ్‌బెర్గ్ తెలిపిందని అన్నారు.
