కడుపులో వోడ్కా బాటిల్ .. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స .. ఒకరి అరెస్ట్
నేపాల్‌లోని 26 ఏళ్ల యువకుడి కడుపులో వోడ్కా బాటిల్‌ను గుర్తించారు వైద్యులు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో.. ఆ బాటిల్ ను శస్త్రచికిత్స చేసి తొలిగించాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
కడుపులోంచి మద్యం బాటిల్‌ను బయటకు తీయడంలో నేపాల్ వైద్యులు విజయం సాధించారు. రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి చెందిన 26 ఏళ్ల యువకుడి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విపరీతమైన కడుపు నొప్పి, వాంతులతో నూర్సాద్ మన్సూరి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఎండోస్కొపి, స్కానింగ్‌లు చేసి.. కడుపులో ఏదో గాజు పదార్థం ఉందని గుర్తించారు. క్షణక్షణానికి ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించారు. వైద్యుల బృందం అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సమయంలో రోగి కడుపులోంచి బాటిల్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
'ది హిమాలయన్ టైమ్స్' వార్తాపత్రిక కథనం ప్రకారం.. బాధిత యువకుడు భరించలేని నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. వైద్యపరీక్షలో పొట్టలో ఏదో ఉన్నట్టు సంకేతాలు వచ్చాయి. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసేందుకు ప్లాన్ చేశారు. కడుపులో ఉన్న వోడ్కా బాటిల్‌ను బయటకు తీయడానికి రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. మద్యం సీసా వల్ల పేషెంట్ పేగు పగిలిందని, దీంతో పరిస్థితి విషమంగా ఉందని శస్త్రచికిత్స చేసిన వైద్యుడు తెలిపారు. పేగు పగిలిపోవడంతో మలం కారుతోంది. ఆపరేట్ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి, కానీ శస్త్రచికిత్స విజయవంతమైంది, ఇప్పుడు రోగి ప్రమాదం నుండి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.
26 ఏళ్ల నూర్సాద్ మన్సూరి తన స్నేహితుడి కారణంగా ఆరోగ్యం క్షీణించిందని పోలీసులు తెలిపారు. అతను స్నేహితులతో కలిసి విపరీతంగా మద్యం సేవించాడు, మత్తులో అతని స్నేహితులలో ఒకరు అతని ప్రైవేట్ పార్ట్ ద్వారా అతని కడుపులో బాటిల్‌ను బలవంతంగా చొప్పించారు.
ఈ కేసులో మన్సూరి స్నేహితుడు షేక్ సమీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నూర్సాద్ స్నేహితులను కూడా విచారించారు. సమీమ్‌పై అనుమానం ఉన్నందున, మేము అతనిని కస్టడీలో తీసుకున్నాం. దర్యాప్తు చేస్తున్నామని చంద్రపూర్ ఏరియా పోలీసు కార్యాలయం ఉటంకించింది. నూర్సాద్ మరికొందరు స్నేహితులు పరారీలో ఉన్నారనీ, వారి కోసం వెతుకుతున్నామని రౌతహత్‌కు చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బీర్ బహదూర్ బుధా మగర్ తెలిపారు.