Asianet News TeluguAsianet News Telugu

కేజీ దొండకాయలు రూ.900. ఎక్కడో తెలుసా?

ఓ యువకుడు లండన్ లో స్థిరపడగా.. అక్కడ కూరగాయలు కొనడానికి వెళ్లాడట. అక్కడ దొండకాయల ఖరీదు చూసి షాకయ్యాడు. వెంటనే సోషల్ మీడీయాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
 

Do you know parwal costs Rs 900 per kg in London? See this post to believe it ram
Author
First Published Apr 20, 2023, 11:41 AM IST

కేజీ దొండకాయలు ధర ఎంత ఉంటుంది..? మహా అయితే రూ.30 ఉంటుందేమో కదా. కానీ... ఓ చోట మాత్రం రూ.900 నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. లండన్ లో కేజీ దొండకాయల ధర రూ.900 అట. విదేశాల్లో స్థిరపడిన ఓ భారతీయుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా... అది నెట్టింట వైరల్ గా మారింది.


ఈ రోజుల్లో చాలా మంది  చదువుకోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతూ ఉంటారు. అలా వెళ్లి.. మన ఫుడ్ దొరకక చాలా మంది ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  ఓ యువకుడు లండన్ లో స్థిరపడగా.. అక్కడ కూరగాయలు కొనడానికి వెళ్లాడట. అక్కడ దొండకాయల ఖరీదు చూసి షాకయ్యాడు. వెంటనే సోషల్ మీడీయాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

ఈ పోస్ట్‌ను ఓంకార్ ఖండేకర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో లండన్‌లోని మార్కెట్‌లో ఉన్న కొన్ని కూరగాయల ఫోటోలను షేర్ చేశాడు. పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ, , కోడిగుడ్లు కూడా అందులో  ఉన్నాయి. అయితే అక్కడ.. కిలో దొండకాయల ధర 8.99 పౌండ్లు, అంటే దాదాపు రూ. 919. అక్కడి ధర విని.. అందరూ షాకయ్యారు.

అంత ధరా అంటూ.. అందరూ షాకయ్యారు. అయితే... ఓ నెటిజన్ మాత్రం.... రోమ్ లో ఉంటే రోమ్ లో ఉన్నట్లే ఉండాలని.. దొండకాయలు తినకూడదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios