మరో అమెరికన్ కంపెనీ కీలక బాధ్యతలు భారతీయుల గుప్పిట్లోకి

మరో అమెరికన్ కంపెనీ కీలక బాధ్యతలు భారతీయుల గుప్పిట్లోకి

ప్రపంచాన్ని శాసిస్తున్న పలు అమెరికన్ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ..  పలువురు భారతీయులు.. భారతదేశ కీర్తిపతాకాన్ని ప్రపంచం నలుమూలలా చాటిచెబుతున్నారు. ఇప్పటికే గూగుల్‌కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు సత్యనాదెళ్ల సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ప్రవాస భారతీయురాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అమెరికన్ ఆటోమొబైల్ రంగంలోనే అతిపెద్ద కంపెనీ అయిన జనరల్ మోటార్స్‌కు భారత్‌కు చెందిన దివ్య సూర్యదేవర చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా (సీఎఫ్‌వో)గా నియమితులయయ్యారు..

ఈ మేరకు జనరల్ మోటార్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. చెన్నైకు చెందిన దివ్య యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్ నుంచి కామర్స్ విభాగంలో డిగ్రీ, పీజీ పట్టాలను అందుకుని.. అనంతరం హార్వార్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చేయటానికి అమెరికా వెళ్లారు.. ఎంబీఏ అనంతరం యూబీఎస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ సంస్థల్లో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా సేవలందించి.. 2005లో జనరల్ మోటార్స్‌లో చేరారు..

అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ.. 2017 జూలై నుంచి కంపెనీ కార్పోరేట్ ఫైనాన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.. ప్రస్తుత సీఎఫ్‌వో చక్ స్టీవెన్స్ సెప్టెంబర్ 1న పదవి నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో దివ్య సూర్యదేవర త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా పలువురు భారతీయులు అభినందనలు తెలుపుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM INTERNATIONAL

Next page