అమెరికా నిఘా విభాగం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ విలియం బర్న్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా నాయకత్వం ఊహించిన ఎదురుదెబ్బలు తింటున్నదని, ఈ విచారం, అసంతృప్తిలో నుంచే అది అణ్వాయుధ దాడికి దిగే ముప్పు ఉందని తెలిపారు. 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ రష్యా అనుకున్నట్టుగా సాగడం లేదని అమెరికా నిఘా అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా ఎదురుగా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తున్నదని అన్నారు. అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర వ్యాకులతకు లోనవుతున్నాడని పేర్కొన్నారు. ఈ విచారం, ఈ అసంతృప్తి నుంచే వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలతో దాడి చేయడానికి వెనుకాడపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

అట్లంటాలోని జార్జియా టెక్ యూనివర్సిటీ ఎదుట నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికా నిఘా ఏజెన్సీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ విలియం బర్న్స్ గురువారం మాట్లాడారు. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా అనేక ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నదని, ఈ విచారంతోనే అది టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వినియోగించవచ్చని వివరించారు.

ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ నాయకత్వానికి చవిచూసిన ఎదురుదెబ్బల తీవ్రత, ముఖ్యంగా మిలిటరీ పరంగా, వారు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌ను వినియోగించే ముప్పు ఉన్నదని బర్న్స్ అన్నారు. అయితే, వాస్తవంతో న్యూక్లియర్ వెపన్స్ మోహరింపుపై అమెరికా వద్ద స్పష్టమైన ఆధారాలు పెద్దగా లేవని వివరించారు. కానీ, ఈ వ్యవహారంపై తాను ఆందోళనగా ఉన్నారని తెలిపారు. తమ అధ్యక్షుడు జో బైడెన్ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి ఇది దారి తీయకూడదనే లక్ష్యంతోనే ఉన్నారని
చెప్పారు. అంతేకాదు, న్యూక్లియర్ దాడి చేసేంత పరిస్థితులు ఏర్పడకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని వివరించారు.

రష్యా ట్యాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌ను కలిగి ఉన్నది. అలాంటి అణ్వాయుధాలు.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమాపై జారవిడిచిన అణు బాంబుల కంటే తక్కువ తీవ్రతతనే కలిగి ఉంటాయి. 

ఒక వేళ అణ్వాయుధాల దాడి పరిస్థితులే వస్తే.. నాటో మిలిటరీ కూటమి ఉక్రెయిన్‌కు అండగా వచ్చి నేరుగా రంగంలోకి దిగినా దిగుతుందనలి ఆయన వివరించారు. నాటో కూటమి ఉక్రెయిన్‌కు సహకరించే ఆలోచనలు ఉన్నాయని తెలిపారు.

రష్యా మరోసారి న్యూక్లియర్ వార్నింగ్ ఇచ్చింది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు అమెరికా సారథ్యలోని నాటో కూటమిలో చేరితే ఈ రీజియన్‌లో అణ్వాయుధాలతో మోహరిస్తామని హెచ్చరించింది. ఆ రెండు దేశాలు నాటో కూటమిలో చేరితే ఇక బాల్టిక్ రీజియన్‌ న్యూక్లియర్ రహితంగా ఉండాలనే ఆశలను వదులుకోవాలని నాటోను ఉద్దేశించి పేర్కొంది. ఎందుకంటే.. బ్యాలెన్స్ కచ్చితంగా మెయింటెయిన్ చేసి తీరాల్సిందేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్
దిమిత్రి మెద్వెదెవ్ అన్నారు. ఈ విషయాలపై చర్చలు, సంప్రదింపులు అనే మార్గాలు ఉండబోవని స్పష్టం చేశారు. బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తామని వివరించారు.

ఈ రెండు దేశాలు నాటో చేరితో సహజంగానే, ఈ సరిహద్దులపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ రోజు వరకు ఇలాంటి చర్య లు తీసుకోలేదని, భవిష్యత్‌లోనూ తీసుకోబోమని తెలిపారు. ‘కానీ, అటువైపుగా ఒత్తిడి పెడితే మాత్రం.. దీనిపై మీరే అర్థం చేసుకోవాలని, ఈ ప్రతిపాదన తెచ్చింది మేమైతే కాదు’ అని వివరించారు. ఫిన్లాండ్ దేశంపై తమ గ్రౌండ్ ఫోర్స్, నావికా దళం, వైమానిక దళాలను మోహరిస్తామని పేర్కొన్నారు. ఫిన్లాండ్ 1300 కిలోమీటర్ల సరిహద్దును రష్యాతో పంచుకుంటున్నది. స్వీడన్
నేరుగా రష్యాతో సరిహద్దు పంచుకోదు. కానీ, ఫిన్లాండ్ పక్కనే ఉన్న దేశం. 

ఈ రెండు దేశాలు ఇటీవలే నాటో కూటమిలో చేరడంపై ఆలోచనలు చేస్తున్నట్టు ప్రకటించిన తరుణంలో రష్యా ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు పశ్చిమ దేశాలతో ఎక్కువగా కలిసి మెలిసి ఉంటాయి. కానీ, ఎప్పుడూ నాటోలో చేరాలనే ప్రయత్నాలు చేయలేదు. తద్వార రష్యాను రెచ్చగొట్టాలని భావించలేదు. కానీ, ఉక్రెయిన్‌పై రష్యా ‘మిలిటరీ చర్య’ను ప్రకటించిన పిదప దాని చర్యలను గమనిస్తున్న తరుణంలో ఈ ఆలోచనలు చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.