హవాయిలో చెలరేగిన కార్చిచ్చు పెద్ద విషాదాన్నే సృష్టించింది. నగరంలో కోలుకోని విధంగా దెబ్బతింది. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 80 మంది చనిపోయారు. ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని గవర్నర్ జోష్ గ్రీన్ తెలిపారు.

హవాయిలో వ్యాపించిన భయంకరమైన కార్చిచ్చు వల్ల మరణాలు సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 80 మంది వరకు చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ భీకరమైన మంటల వల్ల అనేక మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 2,200కు పైగా నిర్మాణాలు కాలిపోయాయని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఫెమా) తెలిపింది. ఈ అగ్నిప్రమాదం వల్ల ప్రభావితమైన ప్రాంతాలను పునర్నిర్మించడానికి సుమారు 5.5 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.

వివాహమైన మాజీ ప్రియుడి కిడ్నాప్.. బలవంతంగా అతడిని మళ్లీ పెళ్లి చేసుకున్న మాజీ ప్రియురాలు..

హవాయిలోని మావీయ్ ద్వీపంలోని రిసార్ట్ సిటీ లాహైనాలో సుదూర హరికేన్ నుంచి వీచిన కార్చిచ్చు ఇంత పెద్ద భారీ స్థాయిలో బీభత్సాన్ని సృష్టించింది. ఈ వేసవిలో ఉత్తర అమెరికాలోని ఇతర తీవ్రమైన వాతావరణ సంఘటనల తరువాత ఈ మంటలు సంభవించాయి. అయితే ఈ ప్రమాదాన్ని అధికారులు తక్కువగా అంచనా వేశారని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ మహిళ అంగీకరించడంతో.. మంటల నిర్వహణపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు హవాయి అధికారులు తెలిపారు. 

ఒకప్పుడు హవాయి రాజకుటుంబం గర్వించదగిన నివాసంగా ఉన్న సుమారు 13,000 మంది నివసించే ఈ పట్టణం ఈ కార్చిచ్చు వల్ల పూర్తిగా దెబ్బతింది. ఇక్కడ ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లు బూడిదగా మారాయి. 150 ఏళ్లుగా సమాజానికి కేంద్రంగా ఉన్న ఒక గంభీరమైన మర్రిచెట్టు మంటలకు దెబ్బతిన్నప్పటికీ.. ఇప్పటికీ నిటారుగా నిలబడి ఉంది. చెట్టు కొమ్మలు, ఆకులు తన వర్ణాన్ని కోల్పోయాయి. ఓ అస్థిపంజరంగా కనిపిస్తోంది.

శరీర గాయాలు మౌనంగా ఉన్నా తగ్గిపోతాయ్.. కానీ దేశానికి తగిలిన గాయాలు రాచపుండుగా మారుతాయ్ - ప్రకాశ్ రాజ్

కాగా.. ఈ కార్చిచ్చుపై హవాయి అటార్నీ జనరల్ అన్నే లోపెజ్ మాట్లాడుతూ.. ఈ వారం మౌయి, హవాయి దీవుల్లో కార్చిచ్చు చెలరేగడానికి దారితీసే కీలక నిర్ణయాలు తీసుకోవడం, స్టాండింగ్ పాలసీలను పరిశీలిస్తామని అననారు. అయితే ఈ మంటల వల్ల ఇప్పటి వరకు 80 మంది మరణించారని అధికారులు చెబుతుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గవర్నర్ జోష్ గ్రీన్ హెచ్చరించారు. ఇప్పటికీ 1,400 మందికి పైగా అత్యవసర తరలింపు షెల్టర్లలో తలదాచుకుంటున్నారు.