ల్యాబ్ లోంచి ప్రాణాంతక వైరస్ సాంపిల్స్ మిస్సింగ్ ... ఎక్కడో తెలుసా? 

ఇప్పుడిప్పుడే కరోనా లాంటి మహమ్మారి వైరస్ ను ప్రజలు మరిచిపోతున్నారు. ఇలాంటి సమయంలో వందలాది ప్రాణాంతక వైరస్ సాంపిల్స్ ల్యాబ్ లోంచి మాయమవడం కలకలం రేపుతోంది. 

Deadly Virus Samples Go Missing from Lab: Shocking Incident in Australia AKP

అత్యంత ప్రమాదకరమైన వైరస్ సాంపిల్స్ ల్యాబ్ లోంచి కనిపించకుండా పోయాయి. ఇలా ఒకటిరెండు కాదు వందలాది ప్రాణాంతక వైరస్ సాంపిల్స్ మిస్సయ్యాయి. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. వైరస్ సాంపిల్స్ మిస్సింగ్ పై క్విన్స్ ల్యాండ్ ప్రభుత్వం సోమవారం ప్రకటన చేసింది. 

ఇలా ల్యాబ్ నుండి కనిపించకుండా పోయినవాటిలో హెండ్రా,లిస్సా, హంటా వంటి ప్రమాదకర వైరస్ సాంపిల్స్ వున్నాయి. ఇలా క్వీన్స్ ల్యాండ్ లోని పబ్లిక్ హెల్త్ వైరాలజీ లాబోరేటరి నుండి గత ఏడాది 2023 అగస్ట్ లోనే ఈ సాంపిల్స్ మిస్సయినట్లు తెలిపారు. ఇలా మొత్తం 323 వైరస్ సాంపిల్స్ మిస్ అయినట్లు తెలిపారు. 

 

ఈ వైరస్ సాంపిల్స్ మిస్సింగ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్రమత్తమైంది. క్విన్స్ ల్యాండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ తో పాటు ఆ దేశ పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

ఏ వైరస్ ఎంత ప్రమాదకరం : 

క్వీన్స్ ల్యాండ్ ల్యాబ్ నుండి మిస్ అయన వైరస్ సాంపిల్స్ లో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి వున్నాయి. ఇందులో హెండ్రా వైరస్ ఒకటి. ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది కేవలం ఆస్ట్రేలియాలోనే గుర్తించబడింది. 

ఇక మరో వైరస్ హెంటా ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనంచేసి మరణానికి కూడా కారణం అవుతుంది. ఇక లిస్సా వైరస్ రేబిస్ వ్యాధికి కారణమయ్యే వాటిలో ఒకటి. ఇలాంటి వైరస్ లు మిస్సవడం ఆందోళనకు కారణం అవుతోంది. 

అయితే ఈ వైరస్ సాంపిల్స్ ల్యాబ్ నుండి దొంగిలించబడ్డాయా లేక ధ్వంసం  చేసారా అన్నది తెలియాల్సి వుంది. ఇప్పటివరకు ఈ సాంపిల్స్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ప్రజారోగ్యం దృష్ట్యా ఈ వైరస్ సాంపిల్స్ ఏమయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. 
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios