మెక్సికోలో భారీ  భూకంపం సంభవించింది. దక్షిణ మెక్సికోలోని వొహాక కేంద్రంగా సంభవించిన భారీ భూకంపం ధాటికి భవనాలు నేలకొరిగాయి. వేల మంది రోడ్లమీదకు పరుగులు తీశారు. 

వొహాక గవర్నర్ మాట్లాడుతూ ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఒకరు మరణించినట్టుగా తెలియవస్తుంది.  భవంతి కుప్పకూలడం వల్ల ఈ మరణం సంభవించినట్టుగా గవర్నర్ తెలిపారు. 

ఇకపోతే ఈ భూకంపంధాటికి ప్రభుత్వ ఆదేనంలో నడిచే చమురు రిఫైనరీ పెమెక్స్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని, ఆ మంటలను వెంటనే ఆర్పివేసినట్టుగా తెలిపారు. ఒక వ్యక్తి ఈ మంటల వల్ల గాయాలపాలయ్యారని, అతడిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలిపారు. 

చిన్న భూకంప సూచనలు తెలియగానే అలారంలు సిరెన్లను మోగించామని, పోలీసు వాహనాలన్నీ కూడా సైరెన్లు మోగించడంతో.... ప్రజలు సమయానికి తమ ఇండ్లలోంచి బయటకు వచ్చి తమ ప్రాణాలను రక్షించుకోగలిగారని అక్కడి వర్గాలు తెలిపాయి. 

అమెరికా జియోలాజికల్ సర్వే లెక్కలప్రకారం 7.4 తీవ్రత కలిగిన భూకంపం మెక్సికోలోని వొహాక కేంద్రంగా నేటి ఉదయం 10.45 కు(అక్కడి కాలమానం ప్రకారం) సంభవించినట్టుగా తెలిపారు. పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.