కరోనా వైరస్ వాక్సిన్ గురించి ప్రపంచదేశాలన్ని ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న తరుణంలో... తమ దేశ వాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పిన రష్యా... చెప్పినట్టుగానే కరోనా వైరస్ తొలి వాక్సిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ప్రభుత్వం తరుఫున వీడియో  కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ వాక్సిన్ సురక్షితమైనదని, దానిపనితీరు అమోఘం అని చెప్పారు. అవసరమైన పరిశోధనలు, టెస్టుల తర్వాతే ఈ వాక్సిన్ ని విడుదల చేస్తున్నట్టు చెప్పాడు. 

తన ఇద్దరు కూతుర్లలో ఒక కూతురు కూడా ఈ వాక్సిన్ ని తీసుకున్నట్టు తెలిపాడు పుతిన్. కరోనా వాక్సిన్ తయారీకి కష్టపడ్డ వారందరికీ ధన్యవాదాలు తెలిపిన పుతిన్.... ప్రపంచానికి ఈ సమయంలో ఇదొక అవసరమైన ముందడుగుగా అభివర్ణించాడు. 

 

వాక్సిన్ సాధ్యమైనంత త్వరగా అందరికి  ఆరోగ్య శాఖా ప్రకటించింది. అక్టోబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందికి ముందుగా ఇదే నెలలో వాక్సిన్ ఇస్తామని ఆరోగ్య శాఖా తెలిపింది. 

0 శాతం మంది ప్రజలకు ఈ వాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురావాలని పుతిన్ ఆదేశించారు. ఇంకో పక్క ప్రపంచ దేశాలు ఈ వాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ ప్రతిష్ట కోసం ప్రజల ప్రాణాలను రిస్కుతో పెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నాయి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అవసరమైన అన్ని భద్రతా  ప్రమాణాలను,టెస్టింగులను నిర్వహించిన తరువాతే వాక్సిన్ ని  అని ఆశిస్తున్నట్టుగా పేర్కొంది. ప్రపంచ దేశాలందరిది ఒకమాటయితే... ఫిలిప్పీన్స్ అధ్యక్షుడొక్కడిది ఇంకో దారి. 

వాక్సిన్ గనుక వస్తే.... థానే మొదటగా పబ్లిక్ గా ఈ వాక్సిన్ ని తీసుకుంటానని ప్రకటించాడు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో నమ్మకం నెలకొంటుందని ఆ దేశాధ్యక్షుడు ప్రకటించాడు. మొత్తానికి కరోనా వాక్సిన్ మార్కెట్లోకి వచ్చేస్తోంది.