కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ఈ కరోనాకి వ్యాక్సిన్  ఇప్పుడిప్పుడే పంపిణీ చేస్తున్నారు. అది ఎంత వరకు పనిచేస్తుందనే విషయంలో క్లారిటీ లేదు.  ఇలాంటి నేపథ్యంలో.. ఈ వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా చైనాలో వెలుగుచూసిన ఓ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.. ఐస్ క్రీమ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రజల్లో కలవరడం మొదలైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని టియాంజిన్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది.. టియాంజిన్ డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో వైరస్ ఉందని గుర్తించారు స్థానిక అధికారులు. వాటిలో 2,089 డబ్బాలను స్టోరేజ్‌లో సీల్‌ చేయగా.. వైరస్ కలిగిన 1,812 డబ్బాలను మరో ప్రాంతానికి అప్పటికే తరలించారు.. మరో 935 డబ్బాలు స్థానిక మార్కెట్‌లోకి ప్రవేశించాయి... వాటిలో 65 డబ్బాలను ఇప్పటికే విక్రయించినట్టు గుర్తించారు. దీంతో.. అవి కొనుగోలు చేసింది ఎవరు అని ట్రేస్ పనిలో పడిపోయారు అధికారులు. 

ఐస్‌ క్రీమ్ డబ్బాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఘటనపై మీడియాతో మాట్లాడిన యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫన్ గ్రాఫిన్.. ఆ డబ్బాల్లో కరోనా వైరస్ మనుషుల ద్వారానే ప్రవేశించిందన్నారు.. దాని ఫలితంగా ఐస్‌క్రీమ్ ప్రొడక్షన్ ప్లాంట్ అంతా వైరస్ వ్యాప్తిచెందే అవకాశముందని హెచ్చరించారు. ఇది ఫ్యాట్‌తో తయారు చేడయం.. కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచడం వల్ల.. వైరస్ వేగంగా వృద్ధి చెందుతుందని.. శరవేగంగా వ్యాప్తి చెందుతున్నారు. 

అంటే కరోనా సోకిన వ్యక్తి ఐస్‌క్రీమ్‌ తయారీలో పాల్గొనడం కారణంగానే.. అక్కడ తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లోకి వైరస్ చొరబడి.. అన్ని డబ్బాల్లోకి చేరినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.