కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలవరం సృష్టిస్తోంది. ఊహించని విధంగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి 36 లక్షలు దాటింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,36,92,605 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,86,839 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 81,48,520 మంది కోలుకున్నారు. 


ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 36,16,747 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,40,140 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి చికిత్స పొంది 16,45,692 మంది కోలుకున్నారు. 

ఇక భారత్ లో పది లక్షలకు కరోనా కేసులు చేరువయ్యాయి. ప్రతి రోజూ దాదాపు 30వేల కేసులు నమోదౌతూ వస్తున్నాయి. కేవలం నిన్న ఒక్కరోజే దాదాపు 30వేల కేసులు నమోదవ్వడం గమనార్హం.

గత 24 గంటల్లో భారత్‌లో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,70,596కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి పెరిగింది. 

ప్రస్తుతం 3,19,840 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,92,032 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,20,92,503 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,86,247 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. కాగా ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వివరాలు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభణ భారీగానే ఉంది.  రా7,6ష్ట్రాల వారీగా.. కరోనా కేసులను ఒకసారి పరిశీలిస్తే...మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,67,665 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 10,695మంది  ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఈ రాష్ట్రంలో 1,47,324మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా ఇప్పటి వరకు 2,099మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీలో 1,15,346మందికి కరోనా సోకగా... 3,446మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు.

గుజరాత్ లో 43,637. ఉత్తరప్రదేశ్ 39,724 రాజస్థాన్ 25,571, మధ్యప్రదేశ్ 19,005 పశ్చిమ బెంగాల్ 32,838 హర్యానా 22,628 కర్ణాటక 44,077 ఆంధ్రప్రదేశ్ 33,019 తెలంగాణన 37,745 అస్సాం 17,807 బిహార్ 19,824 మంది కరోనా బారిన పడ్డారు.